దేశంలో కరోనా రెండవ దశ ఊహించని స్థాయిలో విజృంభిస్తోంది. రెండవ దశలో కేసుల నమోదులో భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.ప్రస్తుతం పది కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినా,వ్యాక్సిన్ కొరత ఉందంటూ రాష్ట్రాల నుంచి సమాచారం అందుతుండంతో కేంద్రం రష్యాకి చెందిన స్ఫూట్నిక్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చింది.కోవ్యాక్జిన్, కోవీ షీల్డ్‌లు కాకుండా స్ఫూట్నిక్ వ్యాక్సిన్‌ను కూడా ప్రజలకు వేస్తున్నారు.అయినా డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడంతో మరిన్ని విదేశీ వ్యాక్సిన్‌లకు అనుమతి ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయం స్వాగతించాల్సిందే.మహారాష్ట్ర తర్వాత ఢిల్లిలో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఢిల్లిలో గంటకు మూడు మరణాలు సంభవిస్తున్నట్టు సమాచారం. మహారాష్ట్రలో లాక్ డౌన్‌ను విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించిందనీ, ఏక్షణంలోనైనా ప్రకటన వెలువడవచ్చని చెబుతున్నారు.అయితే, పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అక్కడి ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు,వ్యాపార వర్గాలు వ్యతిరేకిస్తు న్నట్టు సమాచారం. అందువల్ల లాక్ డౌన్ ప్రకటించకపోయినా, దాని నిబంధనలను అమ లుజేస్తున్నారు. ఇప్పటికే క్లబ్‌లు,పబ్‌ల వేళలను బాగా కుదించారు.మహారాష్ట్రలో విద్యా సంస్థలు మూతపడ్డాయి.అదే పరిస్థితి ఢిల్లిdలోనూ కనిపిస్తోంది.పూర్తి స్థాయి లాక్‌డౌౌన్ వల్ల దినసరి వేతనంపైజీవించే వారు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేని హెచ్చరించడంతో ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.ప్రజల్లో కరోనా పై అవగాహన పెంచినా, జాగ్రత్తచర్యలను వారు పాటించక పోవడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్యరంగానికి చెందిన నిపుణులు పేర్కొం టున్నారు. ముంబాయిలోని మార్కెట్లలో చాలా వరకూ మూతపడ్డాయి. అయితే, చాటు మాటున వ్యాపారాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇరుకు సందుల్లో జనం గుమిగూడటం వల్ల కరోనా వ్యాపిస్తోందనిఅంటున్నారు. భాగ్యవంతులు నివసించే కాలనీల్లో కూడా వైరస్ వ్యాపిస్తోంది. ముంబాయిలో స్టార్ హొటళ్ళను కోవిడ్ కేంద్రాలుగా మార్చేందుకు అధికా రులు ఇప్పటికే ఆయా హొటళ్ళ యామాన్యాలతో సంప్రదింపులు పూర్తి చేశారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా మహారాష్ట్రలోమరిన్ని కఠినమైన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం యోచి స్తోంది. మహారాష్ట్రలో రోజుకు 50వేల కొత్తకేసులు పెరుగుతున్నాయి. కరోనా రెండవ దశ లో మరణించే ప్రతిఆరుగురిలో ఒకరు భారతీయుడై ఉంటున్నాడని అంతర్జాతీయ సంస్థ సర్వేవెల్లడించింది.కరోనా వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాల్సిన అవసరంగురించి భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది.ఈ నేపధ్యంలోనేమరిన్ని విదేశీ టీకాలను దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, దేశంలో వ్యాక్సిన్ కొరత ఉందం టూ మీడియాలోవస్తున్నవార్తలను కేంద్రఆరోగ్య శాఖ కార్యదర్శి ఖండించారు.రాష్ట్రాలకు వ్యాక్సినేషన్ విషయంలోసరైన అవగాహన లేకపోవడం వల్ల అందరికీ టీకాలు వేయలే కపోతున్నాయని అన్నారు. రాష్ట్రాల వద్ద 1.67 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ నిల్వ ఉందని ఆయన తెలిపారు.వ్యాక్సిన్ వేసే నర్సులు సెల్ ఫోన్ మాట్లాడుతూ టీకాలు వేస్తుండటం వల్ల కొంత మేరవ్యాక్సిన్ వృధా అవుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రాలకు 13.10 డోస్‌ల వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు సరఫరా చేయగా, రోజుకు 40 లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నా రని ఆరోగ్య శాఖ కార్యదర్శిచెప్పారు. కరోనా నియంత్రణ యంత్రాంగానికి సరైన శిక్షణ లేద నీ, తగిన సమయం లేకపోవడం వల్ల శిక్షణ ఇచ్చే కార్యక్రమం అమలు కాలేదనీ, దాంతో మామూలుగా వ్యాక్సిన్ చేసే నర్సులు,ఇతర వైద్యసిబ్బంది సేవలను వినియోగించుకోవడం జరుగుతోందని ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరణఇచ్చారు.వ్యాక్సిన్ కొరత ఉందంటూ రాష్ట్రాలూ, లేదంటూ కేంద్రమూ పరస్పరం ప్రకటనలు చేస్తున్న తరుణంలో కొత్త కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా నాలుగువేలుపైగా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రానికి రెండు లక్షల డోస్‌ల వ్యాక్సిన్‌ను కేంద్రం పంపినట్టు సమాచారం. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement