Saturday, November 23, 2024

నేటి సంపాద‌కీయం – టీకా రాజ‌కీయాలు..

క‌రోనా వైరస్‌పై పోరు చివరికి టీకా రాజకీయాలకు దారితీస్తోంది.మానవాళిని మట్టుబెడుతున్న భయంకరవైరస్‌ పై మానవ జాతి మొత్తం ఏకమై పోరాడవల్సిన సమయం ఇది.ఈ సమయంలో వైరస్‌ విజృంభణకు కారణం మీరంటే మీరు అనే రీతిలో ఆరోపణలు చేసుకోవడం, దాంతో వైరస్‌ చాపకింద నీరులా మొదటి దశ కన్నా రెండవ దశలో చాలా వేగంగా విస్తరించడం దురదృష్టకరం.ఈ వైరస్‌ ఇంత వేగంగా విస్తరించడానికి కారణం మానవ తప్పిదమని నిపుణులు తేల్చారు. మానవ తప్పిదమంటే, కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత జనంలో ఎక్కడా లేనిధైర్యంవచ్చేసింది. ఇంక మనం ఎలా తిరిగినా, ఎక్కడ తిరిగినా పర్వాలేదన్న ధీమా పెరిగింది. అదే కొంపముంచిందని ప్రపంచఆరోగ్య సంస్థ నుంచి దేశంలోని ఆరోగ్య నిపుణులవరకూ స్పష్టం చేస్తున్నారు.గత ఫిబ్రవరిలో వైరస్‌ తగ్గినట్లు కనిపించింది. అప్పు డు జాగ్రత్తలను కొనసాగించి ఉంటే వైరస్‌ ఉధృతి పెరిగేది కాదు. కానీ, ఎన్నికల తతంగం ముగించాలని ప్రభుత్వంలోని పెద్దలు,రాజకీయ నాయకులు ఆత్రుతను ప్రదర్శించారు.దీని వల్ల ఎన్నికల నోటిఫికేషన్లు జారీ కావడం, ప్రచారంలో భాగంగా ర్యాలీలు,రోడ్‌ షోలు, సభలూ జరగడంతో జనం సమూహాలుగా ఏర్పడటం అనివార్యమవుతోంది.పెళ్ళిళ్ళ సీజన లేకపోయినా, తెలుగు నాట మూఢమాసాలు పరిగణింపబడుతున్నా, విందులు, వినోదా లు, ఇతర కార్యక్రమాల కోసం జనం సమూహాలుగా చేరడం తప్పడం లేదు. కరోనా వ్యాక్సి నేషన్‌ మొదటి విడత ఇంకా పూర్తి కాలేదు.రెండో డోస్‌ కూడా వేయించుకున్న తర్వాతే వ్యాక్సిన్‌ పనిచేస్తుందని చెబుతున్నా, వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ కే జనం తమకు ఇంకేంకాదన్న ధీమాతో తిరుగుతున్నారు.ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండవ దశలో దేశం మొత్తంమీద మహారాష్ట్రలో ఎక్కువ వేగంగా వ్యాపించ డానికి ప్రజల్లో నిర్లక్ష్యమే కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.ఈ తరుణంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ నిర్వహణ శ్రేయోదాయకం కాదని నగర పెద్దలు ,ప్రముఖులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ఇంత పెద్ద ఈవెంట్‌ను ఆపేయమంటే దీనిపై ఆధార పడినవారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం జంకుతోంది. రోజు వారీ వేతనజీవులు పనులకు హాజరు కావడాన్ని అర్ధం చేసుకోవచ్చు.వినోదం కోసం ఇంత హంగామా,తొందర ఎందుకన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వా నికీ, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకూమధ్య వ్యాక్సిన్‌ వివాదం నడుస్తోంది. వ్యాక్సిన్‌ నిల్వలు రెండురోజులకు మాత్రమే సరిపోతాయని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అంతేకా కుండా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌,హర్యానా తదితర రాష్ట్రాలకు ఎక్కువడోస్‌లను కేంద్రం కేటాయిస్తోందనీ, తమకు వ్యాక్సిన్‌ మందు కేటాయింపుపై వివక్ష గురించి కేంద్రానికి ఇప్పటి కే తెలిపానని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్‌ తోపే పేర్కొనగాఅది నిజం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. వ్యాక్సిన్‌ కొరతఉన్నప్పటికీ అన్నిరాష్ట్రాలకూ అవసరమైన మేరకు టీకా సరఫరా చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. మహారాష్ట్రలో కేసులు ఎక్కువ ఉన్నాయి కనుక, డిమాండ్‌ ఎక్కువ ఉండటం సహజమే. ఈ విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్‌ ఎక్కువ మోతాదులో సరఫరా చేయాలి. అయితే, మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అసమర్ధత వల్లే వైరస్‌ వ్యాపిస్తోందనీ, రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పకుండా రాష్ట్రపతి పాలనవిధించాలని కమలనాథులు కోరుతున్నారు. దీంతో అసలు సమస్య వదిలేసి కొసరు పట్టుకున్నట్టు రాష్ట్రంలోనిరాజకీయ పార్టీల మధ్య ఆరోపణ లు, ప్రత్యారోపణలు ముమ్మరమయ్యాయి. మరోవంక కేసుల సం ఖ్య పెరుగుతోంది.దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించాలని మహారాష్ట్రలో ఏ పార్టీకీ చెందని వివిధ వర్గాల ప్రముఖులు కోరుతున్నారు. ముంబాయికి దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా, విదేశాల నుంచికూడాపర్యాటకులు, సందర్శకులు వస్తుంటారు. అందరిపై ఆంక్షలు విధించ డం సాధ్యంకాదు. న్యూజిలాండ్‌ తమదేశానికి భారతీయలను రావద్దని ఆంక్షలువిదించిం ది. అయినప్పటికీ ఆంక్షల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. పౌరుల్లో వైరస్‌ బెడదపై స్పృహ లేనిదే ప్రభుత్వం ఎన్నిజాగ్రత్తలు, చర్యలుతీసుకున్నా ప్రయోజనం ఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement