Saturday, November 23, 2024

నేటి సంపాద‌కీయం – అంద‌రికీ టీకా అసాధ్య‌మా…?

సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని అమలు జేయాలని ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే చేసిన సూచనను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ తోసిపుచ్చారు.వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అమలు జేయాలంటే అసలు లక్ష్యం దెబ్బతింటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక విధానాన్ని ఏర్పరుచుకు ని ముందుకు సాగుతోందనీ,మధ్యలోదానిని ఆపడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.దేశంలో రెండో దశ కరోనా వేవ్‌ని అరికట్టడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత ప్రధానమని ఆయన అన్నారు. కరోనా తగ్గిన తర్వాత ప్రజల్లో ఏర్పడిన నిర్లిప్తత కారణంగానే కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయన్న నిపుణుల అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. ప్రజలు కరోనా పట్ల గతంలో కన్నా ఎక్కువ స్పృహతో ఉంటున్న మాట వాస్తవమే కానీ, కరోనా ఇక రాదనే తేలిక భావం సర్వత్రా నెలకొంటుండటం వల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే లక్ష కేసులు దాట డం ఆందోళన కలిగించే విషయం. జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం పెరిగింది. మాస్క్‌లను ధరించాలన్న నిబంధ నను పాటించకపోతే 250 రూపాయిలు జరిమానా విధించడంపై విమర్శలైతే వస్తున్నాయి కానీ జరిమానాలు చెల్లిస్తున్నా, నిబంధనలు పాటించేవిషయంలో ఎవరూ పట్టించుకోవ డం లేదు. మాస్క్‌ ధారణ తమ మేలుకేనని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అదే సందర్భంలో పోలీసులకు ఇది అదనపు ఆదాయ మార్గం కాకూడదు. మాస్క్‌ ధారణ నిర్బం ధం చేయడం మన మేలుకేనన్న భావనఅందరిలో కలిగినప్పుడే అది సార్థకత అవుతుంది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబాయిలో సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉంది.దేశంలో యాక్టివ్‌ కేసుల్లో 50 శాతం పైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ముంబాయి దేశానికి ఆర్థిక రాజధాని కావడం వల్ల వివిధదేశాల నుంచివాణిజ్య వేత్తలు తరచూ వస్తుంటారు.అలాగే,వ్యాపారాల నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వదేశీయులే ఎక్కువగా వెళ్తుంటారు.అందువల్ల ముంబాయిలో కరోనా వైరస్‌ క్షణాల్లో వ్యాపిస్తోంది. కరోనా కేసులు అధికంగా ఉన్న పది జిల్లాల్లో ఏడు జిల్లాలు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌, కర్నాట క, ఢిల్లిdల్లో ఒక్కొక్క జిల్లాల్లో కేసుల విస్తరణ అధికంగా ఉందని కేంద్ర కార్యదర్శి పేర్కొన్నా రు.కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని రోజువారీ చేయాలన్న కేంద్ర నిర్ణయం సబబైనదే. ఆదివారా లు, సెలవు దినాల్లో కూడా వ్యాక్సిన్‌ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళేం దుకు ఇష్టపడని వారు ప్రైవేటు ఆస్పత్రులలో వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. పూణ ఆస్పత్రుల్లో బెడ్స్‌ లేక వరండాల్లో రోగులకు చికిత్స చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులలో కూడా రద్దీ పెరగడం వల్ల పరిశుభ్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి చెప్పినట్టు ఈ మహోద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలి. అలాగే, రాష్ట్రాలు ఆర్టీ, పీసీఆర్‌ టెస్టులు 70శాతం చేయాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్‌ డోస్‌లు తెలుగు రాష్ట్రాల్లో వృధా అవుతున్నాయన్న కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన నిజం కాదని తెలుగు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ఖండించారు. కరోనా వ్యాక్సిన్‌ వేయడానికి వస్తున్న జనానికి డోస్‌ల సంఖ్య సరిపోని పరిస్థితి ఏర్పడుతుంటే ఇక వృధా అయ్యే పరిస్థితి ఎక్కడిదని వారు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం చాలా చోట్ల ముగిసింది కనుక,ఇక బహిరంగ సభలు, ర్యాలీల జోరు తగ్గుతుంది. కనుక కరోనా వ్యాప్తి కొంతమేర తగ్గవచ్చు. కరోనా మరోసారి వ్యాపించకుండా చూడటానికి టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అమలు చేయాలని కేంద్రంసూచించింది. కరోనా రెండవ దశ ఉధృతి నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం మరోసారి ముఖ్యమంత్రుల తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. ఎప్పటికప్పుడు కరోనా ఉధృతి రాష్ట్రాల్లో పరిస్థితిని ఆయన తెలుసుకోవడం వల్ల సంబంధితఅధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసేందుకు వీలవుతోంది. వ్యాక్సిన్‌ కొరత లేకుండాచూడటానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. అదే సందర్భంలో ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి కూడాయథా ప్రకారం చేస్తోంది. ప్రభుత్వానికి సహకారం అందించడం పౌరుల కర్తవ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement