కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ ఎన్నికల ర్యాలీలకూ, రోడ్షోలకూ అనుమతి ఎలా ఇస్తారంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మద్రాసు హైకోర్టు నిలదీసింది. అంతేకాకుండా, ఈ అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దేశంలో రెండో దశ కరోనా కేసులూ, మరణాలూ పెరగడా నికి ఎన్నికల ర్యాలీలు,రోడ్ షోలే కారణమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఇరుకైన వీధుల్లో రోడ్ షోలను నిర్వహించడానికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. ఓట్ల లెక్కింపుసమయంలో కోవిడ్ నిబంధనలను పాటిచేట్టు చూడా లని కోరుతూ ఒక అభ్యర్ధి దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని మద్రాసు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణాలుూ అంతే ముఖ్యమని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.తాము ఎన్నికలకు వ్యతిరేకంగా కాదనీ, అదే సందర్భంలో ప్రజలకు భద్రత కల్పించడం కూడా ప్రభుత్వానికి బాధ్యత ఉందని హైకోర్టు గుర్తు చేసింది.దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించే సమయానికి కోవిడ్ రెండవదశ ఇంత తీవ్రంగా లేదు.బహుశా అందుకే, ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేందు కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చి ఉంటుంది. అయితే, మన దేశంలో ఎన్నికలన గానే రాజకీయ పార్టీలు జనాన్ని సమీకరించేందుకు చూపే ఉత్సాహం ఇంతా అంతా కాదు. చిన్న నాయకులకే ర్యాలీలకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే నాయకులు పెద్దనాయకుల సభలకు ఎంతమందిని సమీకరిస్తున్నారో మీడియాలో ప్రసారమయ్యే దృశ్యాలే నిదర్శనం.అంతేకాక, ఎక్కువ మందిని సమీకరించడం ప్రతిష్ఠగా భావిస్తారు.ప్రత్యర్థి సభకు వచ్చిన జనాల కన్నా ఎక్కువమంది తమ సభకు ఉండాలని కార్యకర్తలూ, నాయకులకు లక్ష్యాలను నిర్దేశిస్తారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా సరే నని కార్యకర్తలకు స్పష్టం చేస్తుం టారు. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ పూర్తి అయినా, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల పోలింగ్‌లో సోమవారం ఏడో విడత జరిగింది. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రె స్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను సమర్ధించారు. కరోనా తీవ్రత పెరిగిన తర్వాత మనుషులు పిట్టల్లా రాలి పోతున్న తీవ్ర పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో చివరి నాలుగు విడతల పోలింగ్నూ ఒకే రోజు నిర్వహించాలని ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి పదే పదే విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు.దాంతోఆమె ఖిన్నురాలయ్యా రు.ఆమె కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న మాటవాస్తవమే కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె డిమాండ్ సముచితంగానే ఉంది.అలాగే, దేశంలోని ఇతర ప్రతి పక్షాలు కూడా ఎన్నికలు వాయిదా వేయమని కోరినప్పటికీ, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవ డంతో తమ పార్టీకి కొన్నైనా స్థానాలు వస్తాయేమోనని ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నా యి. మే రెండో తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సమయంలో కోవిడ్ నిబంధనల పాటించే విషయ మై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక ప్రణాళికను రూపొందించి ఏప్రిల్ 30వ తేదీన కోర్టుకు సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ నియమ నిబంధనలను పాటించే విషయంలో హైకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిం చనందుకు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇతర రాష్ట్రాల హైకోర్టులే కాకుండా, సుప్రీం కోర్టు కూడా ఇలాంటి ఆదేశాలనే జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే,ఎన్నికల ఉత్సాహం లో రాజకీయ పార్టీలే కాకుండా, వాటిలో తమ వంతు బాధ్యత నిర్వర్తించేందుకు ప్రజలు కూడా ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారు. అందువల్ల ఇది కేవలం ఒక రాష్ట్రానికో, ఒక పార్టీకో పరిమితమైన అంశం కాదు. మరో వంక ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను అందించడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవాలుగా తీసుకుని ఆగమేఘాలపై ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి తెప్పించేందుకు కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ఆక్సిజన్ అందకపోవడంతో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. పరిస్థితిరోజురోజుకీ తీవ్రమవుతోందని ప్రధానమంత్రి స్వయంగా అంగీకరిస్తున్నారు. ఈ తరుణంలో ఒకే దేశం – ఒకే మాటగా కోవిడ్ నిబంధన లను పాటించడం అందరి కనీస ధర్మం. ఇది యావత్ మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్య.
Advertisement
తాజా వార్తలు
Advertisement