Saturday, November 23, 2024

నేటి సంపాదకీయం – కరోనాపై ఒకే విధానం

దేశంలో కరోనా రెండవ దశలో కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిపోవడంతో ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌, కరోనా టెస్ట్‌ల పై జాతీయ విధానాన్ని రూపొందించి అమలు జేయాలని కేంద్రాన్ని ఆదేశించిం ది. దాంతోప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం మూడు గంట ల్లో నాలుగు సార్లు ఉన్నతస్థాయి సమావేశాలను నిర్వహించారు. శుక్రవారం కూడా ఈ సమావేశాలను నిర్వహించేందుకు ఆయన బెంగాల్‌లో రేపు జరపాల్సిన ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్ట ర్‌ ద్వారాతెలిపారు. మరోవంక వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు కేంద్రానికీ, రాష్ట్రాలకూ వేర్వేరు ధరలను నిర్ధారించడంపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. కేంద్రం వ్యాక్సిన్‌ సరఫరా బాధ్యతనుంచి తప్పించుకోవడానికి వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ల నుంచి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చన్న ప్రకటనజారీ చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు ప్రాణావసరమైన టీకామందును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వా నిదనీ, ప్రైవేటు ఆస్పత్రులకూ, ప్రైవేటు సంస్థలకూ ఈ బాధ్యత అప్పగిస్తే సరైన టీకా మందు లభ్యం కాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ద్వారా వ్యాక్సినేష న్‌ చేస్తేనే అది ప్రాణాలకు హామీగా ఉంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీకా తయారీ సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాల సదుపాయాలను కల్పిస్తున్నప్పుడు ఒక్కొక్క డోస్‌ విలువఆరు నుంచి ఏడువందల దాకా నిర్ధారించే అధికారం ఆ సంస్థలకు ఇస్తే సామాన్యులకు టీకా అందని పండు అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో పేరొందిన ఫేజర్‌ కంపెనీ భారత్‌లో ప్రభుత్వం ద్వారా టీకా సరఫరా చేసేందు కు సిద్ధమేనని ప్రకటించింది. అమెరికాలో ఒక్కొక్క డోస్‌కి 19.5డాలర్లు ఉంది. లాభాపేక్ష లేకుండా వ్యాక్సిన్‌ను భారత్‌కి సరఫరా చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే, ప్రభు త్వం పలు విదేశీ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ధరల విధానం వల్ల సామాన్యులకు టీకా మందు దొరకడం దుర్లభం అవుతుందన్న అభి ప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దేశమంతటా వ్యాక్సిన్‌కు ఒకే ధర అమలులో ఉండేలా చూడాలని కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు.ఒకే దేశం- ఒకే పన్ను మాదిరిగానే ఒకే దేశం- వ్యాక్సిన్‌కు ఒకే ధర ఉండేట్టు చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు.టీకాల కొనుగోలులో రాష్ట్రాలపై అదనపు భారం పడకుండా కేంద్రం ప్రధానమంత్రి కేర్‌ఫండ్‌ నుంచి భరించాలని ఆయన సూచించారు. కాగా, బుధవారం నాసిక్‌లో ఆక్సిజన్‌ లీక్‌ సంఘటన తర్వాత ఆక్సిజన్‌ సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడలేదనీ, దీంతో చాలా చోట్ల ఆక్సిజన్‌ లభ్యం కాక రోగులు అవస్థలు పాలైనట్టు వార్తలు వచ్చాయి. ఢిల్లిdలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా వైద్యులు నిస్సహాయ స్థితిని ప్రకటిస్తున్నారు. వ్యాక్సి న్‌ సరఫరాకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్న సమయంలోనే ఆక్సిజన్‌ కొరత ఏర్ప డటంతో ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ రెండింటిపై ఏక కాలంలో దృష్టిని కేంద్రీకరించ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్ళీ పూర్వస్థాయికి పెరగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య పది వేలు దాటిపోయింది.తెలంగాణలో ఐదువేలు చేరుకుంది.దాంతో హైదరాబాద్‌లో మళ్ళీ కంటైన్‌మెంట్‌ జోన్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు ప్రవేdపెడతారన్న వార్తలు వచ్చాయి. కిందటిసారి ఆంధ్ర ప్రదేశ్‌లో రెడ్‌ జోన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాకు వైద్యంఅందించడం ఒక ఎత్తు అయితే, వ్యాక్సిన్‌,ఆక్సిజన్‌లకు కొరత లేకుండా చూసుకోవడం మరో ఎత్తు అవుతోం ది. కరోనా రోగులకు చికిత్స చేసే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల విషయంలో కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మెరుగైన చికిత్స కోసం వెళ్ళక తప్పడంలేదంటున్నారు. మొత్తం మీద కోవిడ్‌ చికిత్స విషయంలోకేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం లేదన్నది టీకా మందు విషయంలో రుజువైంది. ఇలాంటి సమయాల్లోకేంద్రం తన బాధ్యత ను రాష్ట్రాలకు బదిలీ చేయడంసరైనది కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement