Saturday, November 23, 2024

నేటి సంపాద‌కీయం… అయినా ఇబ్బందే

క‌రోనా రెండవ దశ ఉధృతి కారణంగా హైదరాబాద్‌లోనూ, తెలంగాణాలోనూ రాత్రివేళ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కర్ఫ్యూ వేళల్లో ప్రజలు అత్యవసర పనులకు తప్ప బయటతిరగరాదని మీడియా ద్వారా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.ప్రజల శ్రేయస్సు కోసమే నైట్‌ కర్ఫ్యూని విధించాల్సి వచ్చిందని పోలీసు శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నదృష్ట్యా వేరే ప్రత్యామ్నాయం లేకనే ఈ కఠినచర్య తీసు కోవల్సి వచ్చిందని ప్రభుత్వం వివరించింది.నైట్‌ కర్ఫ్యూ అమలుకు ప్రజలంతా సహకరించాలని ప్రభుత్వం కోరింది. అలాగే, నిబంధనలను పాటించని వారి పట్ల పోలీసు లు దురుసుగా ప్రవర్తించవద్దనీ, వారికి వాస్తవ పరిస్థితిని వివరించి పంపివేయాలని సూచిం చింది.కిందటి సంవత్సరం కూడా జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నందున కర్ఫ్యూ పట్ల అవగాహన ఉంది. వారికి వేరేచెప్పనవసరం లేదు. కర్ఫ్యూ వల్ల ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.ముఖ్యంగా, రాత్రివేళల్లో పనిచేసే సినిమాలు,క్లబ్‌లలో వేలాది మంది ఉపాధిని పొందుతున్నారు.అలాగే, సుదూర ప్రాంతాల్లోఉద్యోగం చేసేవారు తిరిగి వెళ్ళేందుకు నైట్‌ కర్ఫ్యూ ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి అనుభవాలు ప్రజలకు కొత్త కాకపోయినా, మళ్ళీ గుర్తు చేయడం తన ధర్మంగా పోలీసుశాఖ భావిస్తోంది. హైదరాబాద్‌ లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలులో ఉండటం వల్ల గతంలోమాదిరి అవాంఛనీయ సంఘటన లు జరగడం లేదు. ప్రజలు కూడా ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తెలుసుకుని,ఆంక్షలు తమ మేలుకేన ని గ్రహించి సహకరిస్తున్నారు. దేశంలో ఢిల్లిd, ముంబాయి. చెన్నై, బెంగళూరు వంటి నగరాల తో పోలిస్తే మన జంటనగరాల్లో నేరాలు చాలా వరకూ అదుపులో ఉన్నాయి. అయితే,ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. గత ఏడాది లాక్‌ డౌన్‌ ప్రకటించడం వల్ల ఉపాధి కోసం స్వంత ఊళ్ళనుంచి వచ్చిన వలస కార్మికులను తిరిగి పంపడం ఎంతకష్టం అయిందో మనందరికీ తెలుసు. కిం దటిసారి వలస కార్మికులను తిరిగి వెళ్ళనివ్వకుండా వారికి సాయం చేసేందుకు వదాన్యు లు ముందుకు వచ్చారు. ఈసారి కూడా వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వదాన్యులను సామాజిక హితైషులు కోరుతున్నారు. పని ఉన్నా లేకపోయినా రాత్రి పొద్దుపోయేవరకూ తిరిగే వారికే నైట్‌ కర్ఫ్యూ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి వారు పని చేసే సంస్థలు పాస్‌లు జారీ చేస్తాయి కనుక ఇబ్బందులు ఉండవు.పెద్ద సంస్థల్లో పని చేసే వారిపట్ల ఉదారంగానూ, చిన్న సంస్థల్లో పని చేసే వారి పట్ల కఠినంగానూ వ్యవహరించకుండా పోలీసులు తమకు తారసపడిన వారు చూపించే చిరునామా గుర్తింపుకార్డుల ఆధారంగా వారిని విడిచి పెట్టాలి. ప్రజల పట్ల దురుసుగా ప్రవ ర్తించవద్దంటూ నగర పోలీసు కమిషనర్‌ చేసిన సూచన సారాంశం ఇదే. వివిధ వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన పర్యవసానంగా విధించే కర్ఫ్యూకీ, ఇప్పుడు అమలులోఉన్న కర్ఫ్యూకీ తేడా ఉంది. మానవజాతికి మహా ఉపద్రవం తెచ్చిన కరోనా కారణంగా విధించిన ఈ కర్ప్యూలో ఇబ్బందులు అందరివీ ఒకేతీరులో ఉంటాయి. కనుక పరస్పరం అర్ధం చేసుకుని సర్దుకుని పోవడంలో ఇబ్బందులు ఉండవు. పాలు, తాగునీరు మొదలైన నిత్యావసరాల కోసం ఇళ్ళ నుంచి బయటికి వచ్చిన వారిపట్ల పోలీసులు అర్ధం చేసుకుని వ్యవహరించాలి. అలాగే, కరోనా లాక్‌ డౌన్‌ గత ఏడాది మనకు ఎన్నో స్వయంనియంత్రణ పాఠాలను నేర్పిం ది. వాటి వల్ల సామాన్యులకుమేలే జరిగిందికానీ, కీడు జరగలేదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. రాత్రివేళల్లో పని చేసే సంస్థల్లో పని చేసే వారి ఉపాధికి ఈ కర్ఫ్యూవల్ల నష్టం జరుగుతుందన్న మాటవాస్తవమే. అలాంటి వారిని ప్రభుత్వమూ, స్వచ్ఛంద సంస్థ లూ ఆదుకోవాలి. అలాగే, నైట్‌ కర్ఫ్యూ వల్ల నష్టపోయే వర్గాలు ఇతర వర్గాలతోపోలిస్తే చాలా తక్కువే. కనుక కరోనా తొలగిపోయి, తిరిగి మామూలు పరిస్థితులు నెలకొనే వరకూ ప్రజలు స్వయంనియంత్రణ పాటించాలి. కర్ఫ్యూ వల్ల థియేటర్లు బంద్‌ కావడంతోసినిమా వ్యాపా రం బాగా దెబ్బతింటుందన్నమాటవాస్తవమే. సినీరంగానికి చెందిన వారు పెద్ద మనసుతో ఈసారి కూడా సహకరిస్తారని ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement