Friday, November 22, 2024

నేటి సంపాద‌కీయం – మంచి నిర్ణ‌యం…

ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ తమ రాష్ట్రంలో పిపిలీ అసెంబ్లి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు ఎటువంటి ర్యాలీనీ, బహిరంగ సభనూ తమపార్టీనిర్వహించబోదనీ, కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దీనిపై అన్ని వర్గాల నుంచిహర్షం వ్యక్తం అవుతోంది. అలాగే,పశ్చమబెంగాల్‌లో ఇంకా ఎన్నికలు జరగవలసి ఉన్న నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు.తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు ప్రచారం చేసేందుకు ముందుగా సిద్ధ పడిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ రద్దు చేసుకున్నారు. కోవిడ్‌ ఉధృతికి స్పందనగా ఈ నాయకులు తీసుకున్న నిర్ణయాలను రాజకీయాలతోముడిపెట్టడం సమంజసం కాదు. రాహుల్‌ బెంగాల్‌లో నాడి తెలియడం వల్లనే తమ పార్టీ ప్రచారాన్ని రద్దు చేసుకున్నారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు రవిశంకర్‌ ప్రసాద్‌ చేసినప్రకటనలో సౌమ్యత కనిపించడంలేదు. దేశంలోకరోనా రెండవ దశ ఎంతతీవ్రంగా ఉందో ఢిల్లిdలో పరిస్థితే తెలియజేస్తోంది. ఆరు రోజుల పాటు ఢిల్లి ప్రభుత్వం దేశ రాజధాని నగరంలో లాక్‌ డౌన్‌ ప్రకటించింది మాజీ ప్రధా ని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ కరోనా సోకడంతో ఢిల్లి లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతు న్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు కూడాకరోనా సోకినట్టు సమాచా రం. ఇలాంటి పరిస్థితులలో కరోనాపై పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నాయకులు ఉప ఎన్నికల ప్రచారానికి సమయాన్ని కేటాయించడాన్ని జనం హర్షించరు. సాధారణంగా ఎవరెన్ని ర్యాలీలు,రోడ్‌ షోలు నిర్వహించినా జనం ఆక్షేపించరు. బెంగాల్‌ అసెంబ్లి ఎన్నికలను కేంద్రనాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే, దశలవారీగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పటికీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.దీనిపై వస్తున్న విమర్శ లను రాజకీయంగా కాకుండా సహేతుక దృష్టితోచూడాలి. ప్రస్తుతందేశంలో పరిస్థితి గత ఏడాది కన్నా దారుణంగా ఉంది.ఈ విషయాన్ని ప్రభుత్వమే ప్రకటనల ద్వారా తెలియజే స్తోంది. మరో వంక ఎన్నికల ప్రచారానికి కేంద్ర నాయకులు ప్రాధాన్యంఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఈ ఎన్నికల తేదీలు ముందుగా ప్రకటించిన మాటనిజమే. కానీ, కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌ వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రచారాన్ని కుదించుకోవమో, అవసరమైతే ఉప ఎన్నికలను వాయిదా వేయడమో చేస్తే ప్ర భుత్వం ప్రతిష్ఠ పెరుగుతుంది కానీ, తగ్గదు. ప్రతిపక్షాలు ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయంటూ గేలి చేయడం మంచి సంప్రదాయం కాదు. అంతేకాదు.ప్రజల మనోభావాలని దెబ్బతీయడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యాన్ని ఎవరూ తగ్గించి మాట్లాడరు. అయితే, ప్రజల ప్రాణాలు పోతున్న విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారాన్ని మానుకోవ డం తప్పేమీ కాదు. ప్రచారం విషయంలో తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ నవీన్‌ పట్నాయక్‌ చేసిన ప్రకటన ప్రజాస్వామ్య వాదులందరికీ కనువిప్పు కలిగించేది. ఒడిషాలో ఒక్క సోమవారం నాడే నాలుగువేలుపైగా కరోనా కేసులు నమోదు కావడంతో తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితి బెంగాల్‌లోనూ ఉంది. మిగిలిన దశల ఎన్నికలన్నింటినీ ఒకే రోజున నిర్వహించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు చేతులు జోడించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.అయితే, కేంద్రంలో కమలనాథులు ఆమెతో తాడో పేడో తేల్చుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్న కారణంగా వారికి ఆమె అభ్యర్ధన వినిపించి ఉండకపోవచ్చు. ఇలాంటి ఆప త్కాలాల్లో రాజకీయాల కన్నా ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న నవీన్‌ పట్నాయక్‌ ప్రకటన ఎంతో విలువైనది. కరోనా వ్యాపిస్తున్న వేళ ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు రద్దు చేసు కోవాలని దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఓ పార్టీకో.. ఓ రాష్ట్రానికో ప్రతిష్ఠాత్మకమైంది కాదు. ప్రజలంతా ఏకోన్ముఖంగా పోరాడాల్సిన సమయం ఇది. అత్యవసర సేవలు మినహా మిగిలినవి వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement