హిజాబ్‌కి వ్యతిరేకంగా ఇరాన్లో సాగుతున్న ఆందోళనలు తీవ్రం కావడంతో దేశాధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ తీవ్ర హెచ్చరిక చేశారు. ఆందోళనకారులు గీత దాటుతున్నారనీ, ఇక సహించేది లేదనీ, ఇరాన్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుని తీరుతామంటూ హెచ్చరించారు. ఇరాన్లో ప్రస్తుత పరిణామాలకు అమెరికాదే బాధ్యత అంటూ ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. పార్టీలతో, వర్గాలతో సంబంధం లేని తటస్థులు కూడా ఇదే మాటంటున్నారు. అయితే, క్రమంగా ఇది మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగే పోరాటంగా రూపు తీసుకుంటోంది. మహిళలు కూడా అదే మాటంటున్నారు. తాము స్వేచ్ఛ, సమా నత్వం కోసం పోరాడుతున్నామంటూ ఈ ఆందోళనలో అధిక సంఖ్యలో పాల్గొంటున్న మహిళలు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలు మత ఛాందస వాదానికి వ్యతిరేకం గానేనని మహిళలు స్పష్టం చేస్తున్నారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న మషా అమిని అనే యువతి భద్రతా దళాల నిర్బంధంలో తీవ్రంగా గాయాలు పాలై మరణించిన ఘటన ప్రస్తుత ఆందోళనలకు ఆజ్యం పోసింది. ఆమె ప్రాతినిధ్యం వహి స్తున్న కుర్దిస్థాన్‌లో ఈనెల 17వ తేదీన ప్రారంభమైన అల్లర్లు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు వ్యాపించాయి. హిజాబ్‌ని సరిగా ధరించలేదన్న కారణంతో ఆ యువతిని భద్రతాదళాలు అరెస్టు చేశాయి.
వారి కస్టడీలో ఆమె శరీరం నిండా గాయాలు కావడం, ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించడంతో దేశమంతా అల్లకల్లోలంలా మారింది. ఈ అల్లర్లలలో ఇంతవరకూ 76 మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో ఆందోళనలు మరింత తీవ్రతరం అయ్యాయి. అయితే, అమెరికా, దాని మిత్రదేశాలూ ఇరా న్కి వ్యతిరేకంగా కుట్రపన్ని ఈ ఆందోళనలను ప్రోత్సహిస్తున్నాయని దేశాధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ ఆరోపించారు. అల్లర్లు అయితే, ఇన్ని రోజులు సాగవనీ, బాహ్య శక్తులు పనిగట్టుకుని ప్రోత్సహిస్తున్నందువల్లనే నిరవధికంగా సాగుతున్నాయని ఆయన ఆరోపిస్తు న్నారు. అయితే, ఆయన చేసిన ఆరోపణలో నిజం లేదన డానికి స్విట్జర్లాండ్‌లో ఇరాన్ మహిళలు జరుపుతున్న ఆందోళనను ఉదాహరణగా పేర్కొనవచ్చు. మషా అమిని మరణానికి నిరసనగా స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రదర్శనలో మధ్య వయస్కురాలైన ఒక మహిళ తన జుట్టును కత్తిరించుకుంటున్న చిత్రం అంతర్జాతీయ మీడి యాలో వైరల్ అవుతోంది. స్పెయిన్ తదితర దేశాల్లోనూ అతివలు ఇరాన్ మహిళల పోరాటానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో కోల్‌కతా లోనూ, కేరళలోని నగరాల్లోనూ ఇరాన్ మహిళలకు మద్దతుగా ఆందోళనలు జరుపుతున్నారు. అందువల్ల ఈ ఆందోళనలు అమెరికానో, ఇతర దేశాలో చేయిస్తున్నవి కావు. మతఛాందస వాదాలను నేటి తరం మహిళలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, నగరాల్లో వ్యతిరేకి స్తున్నారు.
అంతర్జాతీయంగా మీడియా విస్తృతి పెరగడం వల్ల ఎక్కడ ఏం జరిగినా, వెంటనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు, ప్రాంతాలకు ఆగమేఘాలపై చేరి పోతు న్నది. ముఖ్యంగా, అంతర్జాలం, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇలాంటి వార్తల ు క్షణాల్లో వ్యాపిస్తున్నాయి. ఇరాన్ ఆయతుల్లా ఖొమైనీపాలనలో ఉన్నప్పుడు ఛాందస వాద ధోరణులు ఇంకా ఎక్కువగా ఉండేవి. అఎn్ఘానిస్తాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడంతో ఇస్లామిక్ దేశాల్లో చాందస ధోరణులు ఊపిరి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా, మహిళలపై మత పెద్దలు ఆంక్షలు విధించడం, మహిళలకు విద్యా వ్యాసంగాలకు అడ్డు చెప్పడం వంటి ధోరణులను అన్ని దేశాల్లో మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బంగ్లా దేశ్‌కి చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇటీవల ఇరాన్లో మహిళల పోరాటాన్ని ప్రశంసిస్తూ ప్రకటన చేశారు.
ఆమె మతపెద్దల ఆగ్రహానికి గురై మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. మహిళల్లో విద్యా వంతులు పెరుగుతున్నకొద్దీ ఛాందస భావాలకు వ్యతి రేకంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే, పాశ్చాత్య నాగరికత ప్రభావాన్ని ఇతర దేశాల్లో కంటే ఇస్లామిక్ దేశాల్లో పాలకులు సహించలేకపోవడం వల్ల ఇలాంటి ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఇరాన్‌కీ, అమెరికాకీ మధ్య వైరం ఉన్న మాట నిజమే. ఇరాన్ రహ స్యంగా అణు కార్యక్రమాన్ని సాగిస్తోందన్న అను మానంతో ఇరాన్‌పై అమెరికా దశాబ్దాలుగా సమయం వచ్చినప్పుడల్లా విరుచుకుని పడుతోంది. ప్రస్తుత ఆందోళనలకు అమెరికా ప్రోద్బలం ఉందన్నది కేవలం అపోహ మాత్రమేనని అనుకోవాలి.