Monday, November 25, 2024

అంతరిక్షానికి విమాన సర్వీసులు….

పర్యాటక ప్రియులు ఇప్పటికిప్పుడు అంగా రక గ్రహంపైకి గాని, చందమామ పైకి గాని వెళ్ళలేకపోయినా అంతరిక్ష ప్రయాణ అనుభూతి పొందేందుకు స్పేస్‌ ప్లేన్‌ (అంత రిక్ష విమానం) ద్వారా ‘వర్జిన్‌ గొలాక్‌టిక్‌’ సంస్థ వీలు కల్పిస్తోంది. అంతరిక్షం అంచు లను తాకి భారరహిత అనుభూతిని ఆస్వా దించి, అద్భుత అనుభవాన్ని మూటగట్టుకుని తిరిగి భూమి పైని ‘రాకెట్‌ పోర్ట్‌’ కు చేరుకునే సౌకర్యాన్ని ఆ సంస్థ కల్పిస్తోంది. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని ఆ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్షంలోని నాసాకు చెందిన అంతర్జాతీయ పరిశోధన కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) ప్రైవేటు వ్యక్తుల్ని సైతం తీసుకెళ్లి, తీసుకు వచ్చే ఆలోచనలో ఆ సంస్థ ఉంది. ఇది పూర్తిగా పర్యా టక స్వభావంతో కొనసాగుతున్న యజ్ఞం. ప్రపంచ పౌరులందరూ ఈ పర్యాటక అనుభూతిని ఆస్వాదిం చవచ్చని ఆ సంస్థ పేర్కొన్నది. అంతరిక్ష పర్యాటకమే గాక పరిశోధకుల ప్రయోగాలకు వీలు కల్పిస్తామని కూడా అంటోంది. న్యూ మెక్సికోలోని స్పేస్‌ పోర్ట్‌ (అంతరిక్ష విమానాశ్రయం)లో వ్యోమగాముల, పర్యాటకుల ప్రాథమిక అవగా#హన కోసం కొన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు.. పర్యాటకులు నింగిలోకి రాకెట్‌ దూసుకెళ్లినప్పటి అనుభూతిని సైతం ఈ అంతరిక్ష విమానాల ద్వారా పొందవచ్చు నంటున్నారు. 2019 సంవత్సరంలో ఈ ప్రయోగం విజయవంతమైంది. దాదాపు 90 కిలోమీటర్ల పైకి అంతరిక్ష విమానం వివిఎస్‌ యూనిటీ ఎగిరింది. అంటే భూ కక్ష్య చివరి అంచులను తాకి భార రహిత అనుభూతికి ప్రయాణికులు గురయ్యారు. ఓ ప్రయా ణీకుడు విమాన క్యాబిన్‌లో గురుత్వాకర్షణ లేక తేలి పోయాడు. ఇదేరకమైన అంతరిక్ష ప్రయాణ సౌకర్యా న్ని త్వరలో బోయింగ్‌ సంస్థ కూడా కల్పించనున్నది. ‘స్టార్‌ లైనర్‌’ పేర సర్వీసులను ప్రారంభించబోతోం ది. భూ కక్ష్య అంచుల వరకు పర్యాటకులను తీసుకెళ్లే కార్యక్రమాలకు డిమాండ్‌ పెరుగుతోంది. అంతరిక్షం లోకి ప్రయాణించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబ రుస్తున్నారు. భవిష్యత్తులో ఇది పెద్ద వ్యాపారంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీ య స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)కు నాసా వ్యోమగాము లతోపాటు, పర్యాటకులు వెళ్లే సూచనలు కనిపిస్తు న్నాయి. ఈ స్పేస్‌ స్టేషన్‌ను వ్యాపారాత్మకంగా ఉప యోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ‘వర్జిన్‌ గొలా క్‌ టిక్‌’ సంస్థ పంపే పర్యాటకుల, ప్రయాణికుల వాహ నం గాలిలోనే (ఆకాశంలోనే) టేకాఫ్‌ అయ్యేలా రూప కల్పన చేసింది. ఇదొక మధురానుభూతిని కలిగిస్తుం దని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సంస్థ ప్రధానంగా ‘స్పేస్‌ పోర్ట్‌’ నుంచి భూ కక్ష్య అంచుల వరకు ప్రయా ణికులను తీసుకెళ్లి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టు కుంది. ఈ పర్యాటకంపై ఆసక్తిగల సంస్థలు, కంపెనీల ను సంప్రదించి, అవసరమైన వనరులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తోంది. భవిష్యత్తులో ఈ పరిధి విస్తరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నా యి. ఇలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ మాదిరి నాసా వ్యోమగాములను అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లనున్నది. అలాగే ప్రయోగాల కోసం వెళ్లే వారిని కూడా అక్కడికి చేర్చనున్నది. వ్యోమగాముల కవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఈ సంస్థ రూ పొందిస్తోంది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం చేసే వారికి ప్రాథమిక అవగాహన కార్యక్రమాలను సైతం ఈ సంస్థ రూపొందించింది. ముఖ్యంగా ఈ స్థితిలో సంతులనం కోసం తీసుకోవాల్సిన చర్యల్ని ఆ సంస్థ తెలియజేస్తోంది. బ్రిటన్‌కు చెందిన సర్‌ రిచర్డ్‌ చార్లెస్‌ నికోలస్‌ బ్రాన్సన్‌ ఈ సంస్థ వ్యవస్థాపకుడు. 1970లో ప్రారంభించిన వర్జిన్‌ గ్రూపు నుంచి ఈ సం స్థ ఆవిర్భవించింది. ఈ గ్రూపు వందల కంపెనీలను నిర్వహిస్తోంది. అందులో ఒకటి ఈ ‘వర్జిన్‌ గొలాక్‌ టిక్‌’ సంస్థ. అంతరిక్ష ప్రయాణికుల కోసం, సైన్స్‌ మిషన్స్‌తో వెళ్లేవారి కోసం అంతరిక్ష విమానాలను తిప్పడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని 2004 సంవత్స రంలో ప్రారంభమైంది. వాణిజ్య దృక్పథంతోనే ఇది పనిచేస్తోంది. ‘స్పేస్‌ పోర్ట్‌’ అన్న పదాన్ని విస్తృత ప్రచా రంలోకి తీసుకొచ్చింది. వీలైనన్ని ఎక్కువ ‘ట్రిప్పులు’ అంతరిక్షానికి తిప్పాలన్న ఆలోచనతో, అవసరమైతే ప్రయాణికులను ఆకర్షించి, బ్రోకరింగ్‌ పాత్రను పోషించనున్నది.
నికోలస్‌ బ్రాన్సన్‌ 1950 జూలై 18న లండన్‌కు దగ్గరలోని బ్లాక్ హీత్‌లో జన్మించారు. బ్రిటన్‌లో పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ‘వర్జిన్‌’ పేర విమానాలు కూడా ఉన్నాయి. ఆయన రచయితగా, దాతృత్వం గల వ్యక్తిగా పేరొందారు. 2009 సంవత్స రంలోనే అంతరిక్ష విమాన ప్రయాణ యోచన చేసినా 2014 అక్టోబర్‌లో ఆ కల పాక్షికంగా సాకారమైంది. 2018 సంవత్సరం డిసెంబర్‌లో అంతరిక్ష విమాన ప్రాజెక్టులు విఎస్‌ఎస్‌ యూనిటి విపి-03 ఇద్దరు చోదకులతో విజయవంతంగా నింగిలోకి ఎగిరి అమెరికా ప్రమాణాలను చేరుకుంది. 82.7 కిలోమీట ర్ల ఎత్తు ఎగిరింది. 2019 సంవత్సరం ఫిబ్రవరిలో మరో ముగ్గురితో నింగిలోకి మరోసారి ఎగిరింది. ఈసారి మరికొంత ఎక్కువ ఎత్తు ఎగిరింది. దాంతో అంతరిక్ష పర్యాటకాన్ని విజయవంతంగా నిర్వహిం చగలమన్న ధీమా ఆ సంస్థలో ఏర్పడింది. ఇప్పుడు స్పేస్‌ షిప్‌ నిర్మాణంలోనూ నిమగ్నమైంది. ఆ సంస్థ 15వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 1969 సంవత్సరంలో అమెరికా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌, బజ్‌ ఆల్టిన్‌ చందమామపై పాదం మోపినప్ప టినుంచి అంతరిక్ష పర్యాటకంపై ప్రజల్లో మోజు పెరిగింది. సమాజంలో గొప్ప పేరు కోసం, గొప్ప అనుభూతి కోసం అంతరిక్షంలోకి వెళ్ళి రావాలన్న ఆకాంక్ష అధికమైంది. వాస్తవానికి అప్పటి సోవియట్‌ యూనియన్‌ తొలిసారి అంతరిక్షంలోకి వ్యోమగామి ని పంపింది. అనంతరం చందమామపైకి మరో వ్యోమగామిని పంపే ప్రయత్నం చేసింది. ఆ రోజుల్లో సోవియట్‌ రోదసి యాత్రలు ఎక్కువగా సాగాయి. అయితే చందమామపై అమెరికాకు చెందిన నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ తొలిసారి కాలు మోపగానే అమెరికాకు ఎక్కు వ మార్కులు దక్కాయి. ఆ వ్యోమగామి పేరు మార్మో గింది. దాంతో అమెరికా పలుకుబడి అనూ#హ్యంగా పెరిగింది. ఆ విజయం అందించిన స్ఫూర్తితో అమెరి కా అంతరిక్ష రంగంలో దూసుకుపోయింది. ‘నాసా’ ప్రతిష్ట ఆకాశానికంటింది. అలా ఓ ఊపుతో ప్రారంభ మైన అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు ప్రైవేటు రంగ సంస్థల చేతుల్లోకి కూడా వచ్చి చేరింది. ఒకటా, రెండా.. అనేక సంస్థలు అంతరిక్ష పర్యాటకులను తీసుకెళ్లేందుకు పోటీపడుతున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యాపారం మరింత విస్తరి స్తుందన్న విశ్వాసం అందరి లో ఉంది. చందమామపై, మార్స్‌ పై కాలనీల ఏర్పాటు తర్వాత మొత్తం ‘దృశ్యం’ మారనున్నది.
-ఉప్ప‌ల న‌రసింహం

Advertisement

తాజా వార్తలు

Advertisement