Monday, November 18, 2024

సాగు చ‌ట్టాల బాధ్య‌త రాష్ట్రాల‌కు….

రైతులు భూమిని సాగు చేసి అన్నం పండిస్తే, రాజకీయ నాయకులు రైతులకు భరోసా నిచ్చి అధికారాన్ని చేజిక్కించుకుంటారు. చట్టసభల్లో నిజమైన వ్యవసాయదారులు తక్కువగానే ఉంటారు. స్వతంత్ర భారతం లో నేటికి 33 మంది కేంద్ర వ్యవసాయశాఖ మంత్రులను చూసింది. వీరిలో 25 మంది మంత్రులు గ్రామీణ నేపథ్య కుటుంబం నుంచి వచ్చా రు. ప్రస్తుత లోకసభలోని 542 మంది ఎంపీల్లో 38 శాతం సభ్యులు రైతు కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నా రు. గత లోకసభలో 20 శాతం సభ్యులు మాత్రమే రైతు నేపథ్యం నుంచి రావడం జరిగింది. వ్యవసాయ కుటుంబాల నుండి ఎన్నికైన ఎంపీలు ఎంత మంది ఉన్నా రైతులకు ఒరిగింది మాత్రం గుండుసున్ననే అనేది నిర్వివాదాంశం. అనాదిగా చట్టసభల నిర్ణయా ల్లో గ్రామీణ భారత గళం కూరుకుపోతే, నగర మేధావుల మాటలే శాసనాలు అవుతున్నాయి. హరి త విప్లవాలు, రైతు పక్షపాతాలు, రైతును రాజును చేసే వాగ్దానాలు నీటిలో మూటలే అవుతున్నాయి. కర్షకుల చుట్టు రాజకీయ నాయకుల కపట మాటల వాగ్దానా లు ఓట్లతో మాయమవుతున్నాయి. రైతులు ఎల్లప్పు డూ అసంఘటిత వర్గమే. దేశ రాజధానిలో రైతుల నిరసనలతో రోడ్డెక్కి 100 రోజులు దాటుతోంది. రాజధాని పొరుగు రాష్ట్రాల సిక్కులు, జాట్‌లు రైతుల పోరును నడుపుతూ, గ్రామీణ భారత రైతాంగానికి ప్రతినిధులమని భావిస్తున్నారు. ఈ పోరును ఎక్కువ కాలం నిలుపడానికి ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఆర్థిక , లాజిక్టిక్‌ సహాయాలను అందిస్తున్నారని అంటున్నా రు. రైతుల సమస్యల పరిష్కారం కన్నా అధికారం కోసం వేసే రాజకీయ ఎత్తుగడలకే మన పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. రైతులకు అసలైన మద్దత్తుదారు లు ఎవరో చెప్పడం కష్టం. రైతు ఉద్యమకారులకు వ్యవసాయ చట్టాల రద్దు చేయడమే ఏక సూత్రమైం ది. చట్టసవరణలు మినహా మరేది వీలు కాదనేది ప్రభుత్వ స్వరం. నూతన వ్యవసాయ చట్టాలతో రైతు లకు మేలు జరుగుతుందని, పంటలకు మంచి ధరలు పలుకుతాయని, ఆధునిక వ్యవసాయ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని, మార్కెట్‌లో రైతు ఉత్పత్తులకు పోటీ పెరిగి ధరలకు రెక్కలు వస్తాయని ప్రభుత్వం అంటోంది. ఈ చట్టాల ఫలితంగా కార్పొరే ట్లు లాభపడుతారని, కనీస మద్దత్తు ధర లభించక రైతులు నష్టపోతారని రైతు సంఘాలు అంటున్నా యి. అనేక చర్చలు జరిగినా ఎవరి పంతం వారిదే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దేశంలో 60 శాతం కర్షక భారతమే ఉన్నప్పటికీ రైతుల పక్షాన గొంతెత్తే జాతీయ స్థాయి నాయకులు కనబడుట లేదు. వారి కోరికలను సమయానుసారం సకారాత్మ కంగా ప్రభుత్వాల ముందు పెట్టడం లేదనే అభిప్రా యాలు వినిపిస్తున్నాయి. రాకేష్‌ తికాయిత్‌ లాంటి వారు ఆందోళనలో రైతులను ఆకర్షించుటలో మాత్ర మే సఫలం అవుతున్నారు. గతంలో చౌదరీ చరణ్‌ సిం గ్‌, దేవీలాల్‌, శరద్‌ పవార్‌, బలరామ్‌ జక్కర్‌, ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ లాంటి వారు జాతీయ రైతు నాయకులు గానే పిలువబడ్డారు. ప్రముఖ శాస్త్రవేత్త సి. సుబ్ర#హ్మ ణ్యం, భారతరత్న స్వామినాథన్‌లు హరిత విప్లవాని కి, వ్యవసాయాభివృద్ధికి ఎంతో మేలు చేశారు. సంస్క రణల పేరుతో గ్రామీణ భారతం నిస్సహాయంగా నలుగుతూనే ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం దేశ జీడీపీలో 50 శాతం వ్యవసాయరంగమే అందించేది, కాని నేడు 15 శాతం మాత్రమే దేశ జీడీపీకి ఊతం ఇస్తున్నది. భారతదేశ చరిత్రలో 1929లో స్వామి స#హజానంద సరస్వతి నాయకత్వంలో జరిగిన జమిందారీ వ్యతిరేక ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఉద్య మం, పలు సందర్భాలలో కమ్యూనిస్టులు నిర్వ#హం చే రైతు నిరసనలు, 1946-51 మధ్య తెలంగాణలో జరిగిన నిజామ్‌-జమిందారీ వ్యతిరేక రైతాంగ పోరా టాలు, పశ్చిమ బెంగాల్‌లో కమ్యునిస్టుల ఉద్యమం, 1970ల్లో మహారాష్ట్ర షెత్కారీ సంఘటన్‌ లాంటి రైతు ఉద్యమాలు ఒక ప్రాంతానికి పరిమితమై స్థానికంగా జరిగాయి. గ్రామీణ సంక్షేమ రాజకీయం ఎల్లప్పుడూ నగర ఆర్థిక విశ్లేషణ దృష్టిలో నష్టాలుగానే తోస్తున్నది. వ్యవసాయదారులు సంఘటితం కావ డం జరుగదు. దేశంలో ఎలాంటి ఆందోళనలు జరిగి నా సంఘ విద్రో#హశక్తులు గుంట నక్కల్లా విధ్వంస కాండకు పూనుకుంటారని మరువరాదు. ప్రస్తుత రైతు ఆందో ళనలు సమిసి పోవడానికి ఇరుపక్షాలు దృష్టిపెట్టాలి. పంతాలు పట్టింపులు ప్రగతి నిరోధకా లు. నిపుణుల విశ్లేషణ ప్రకారం నూతన వ్యవసాయ చట్టాల అమలును రాష్ట్రాల అభిమతానికి వదిలేయా లి. నూతన చట్టాలను పాటించే రాష్ట్రాలు, పాత విధా నాలను అనుసరించే రాష్ట్రాలు ఉండవచ్చు. ఏ వ్యవ సాయ చట్టాలు మేలు చేస్తాయో కాలమే నిర్ణయిస్తుం ది. నూతన చట్టాలు లాభ సాటివని తేలితే దేశ రైతు లు వాటిని కోరుకుంటారు, లేనియెడల పాత పద్దతు లు పాటిస్తారు. ఇలాంటి పరిష్కారం ఇరుపక్షాలకు గెలుపును ఇస్తాయి.

  • డాక్ట‌ర్ బుర్ర మ‌ధుసూధ‌న్ రెడ్డి
Advertisement

తాజా వార్తలు

Advertisement