Saturday, November 23, 2024

అగ్నిపథ్‌ ఇక అనివార్యమే!

సైన్యంలో రిక్రూట్‌మెంట్‌ విషయంలో పెను మార్పు లకు ఉద్దేశించిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా సోమ వారంనాడు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ పాటించారు. అగ్నిపథ్‌ పై ఆందోళన కారణంగా గత వారం చివరలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో రైల్వేలకు భారీ నష్టం సంభవించింది. దాంతో 500కి పైగా రైళ్ళను నిలిపివేశా రు. అయితే, ఈ పథకాన్ని హడావుడిగా ప్రవేశపెట్ట లేదనీ, రెండేళ్ళు పైగా కసరత్తు చేసి,ఎంతో ఆలోచించి ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని త్రివిధ దళాధిపతులు స్పష్టం చేసిన మరునాడే కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకోసం జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అగ్నివీరులు త్రివిధ దళాల్లో నాల్గేళ్ళు పని చేసిన తర్వాత కేంద్ర సాయుధ దళాల్లో కానీ,ఎక్కడ ఖాళీ లుంటే అక్కడ కానీ చేరేందుకు అర్హులు. అయితే, అగ్ని వీర్‌కి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్నవారికి అగ్ని వీర్‌ సర్వీసులో చేర్చుకోరు. అలాగే, అగ్నివీర్‌ కేడర్‌ని ప్రత్యేక కేడర్‌గా గుర్తిస్తారు. వారికి ఏడాదిలో ముప్పయి రోజుల సెలవు, డాక్టర్ల సలహాలను బట్టి మెడికల్‌ లీవులు, ఇతర సదుపాయాలు ఉంటాయి. అగ్నివీర్‌లు తమను ఎక్కడ నియోగిస్తే అక్కడ వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. వారికి వేతనాల విషయంలో ఎటువంటి అన్యాయం జరగదనీ, నాలుగేళ్లలో ఏ యేడాది ఎంత వేతనం చెల్లిస్తారో,అలవెన్సులు ఎంతో, సర్వీసు పూర్తి అయిన తర్వాత ఎంత ఇస్తారో ఆ పట్టికలను కూడా కేంద్రం విడుదల చేసింది. ఈ పథకంపై పునరాలోచన లేనేలేదని కేంద్రం స్పష్టం చేసింది. మరో వంక ఈ పథకానికి వ్యతి రేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా యి. కాంగ్రెస్‌ ఢిల్లి లోని జంతర్‌ మంతర్‌ వద్ద సత్యా గ్రహాన్ని నిర్వహించింది. ఈ ఆందోళనలో పాల్గొనేందు కు వెళ్తున్న వారిని దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.ఢిల్లి లోనూ, సమీప రాష్ట్రాల్లో ఆందోళనకారులను ముందుగానే అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, కేరళ, రాజస్థాన్‌ల లో కూడా నిషేధాజ్ఞలు ప్రకటించి అరెస్టులు సాగిస్తున్నా రు. బీహార్‌లో 20 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారు.కాగా, కేంద్ర సాయుధ దళాల్లో,అసోం రైఫిల్స్‌ దళంలో అగ్నివీరులకు మూడేళ్ళ మినహాయిం పు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.

అగ్నివీర్‌ పథకానికి ఆనంద మహీంద్రా మద్దతు ప్రకటించారు. తమ సంస్థల్లో నియామకాల విషయంలో అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన ప్రకటించారు.అలాగే, ఆర్‌పీజీ గ్రూపు చైర్మన్‌ హర్ష గోయంకా కూడా ఈ పథకానికి మద్దతు ప్రకటించారు.అగ్నివీర్‌ శిక్షణ పొంది న వారికి తమ సంస్థల్లో రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యం ఇస్తామని ఆయన ప్రకటించారు. త్రివిధ దళాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో సుశిక్షితులైన పౌరులు అవసర మని ఆయన అన్నారు. ఇతర కార్పొరేట్‌ సంస్థల అధిప తులు కూడా ఈపథకం పట్ల అనుకూలతను ప్రకటించా రని ఆయన తెలియజేశారు. ఈ పథకం పట్ల ఆందోళన లు సాగుతున్నట్లే దీనికి అనుకూలంగా పలువురు ప్రకటనలు చేయడం గమనార్హం.ఆందోళనకారులు ఈ పథకం గురించి లోతుగా ఆలోచించకుండా ఎవరో రెచ్చ గొడితే రెచ్చిపోయి ఆందోళనకు దిగడం వారి భవిష్య త్తుకి మంచిది కాదని సలహా ఇస్తున్నారు. ఆ మాటా నిజమే, ఈ ఆందోళనలో పాల్గొన్నవారికి అగ్నిపథ్‌ రిక్రూట్‌ మెంట్‌లో ఇప్పటికే తలుపులు మూసేశారు. ప్ర భుత్వ, ప్రైవేటు సర్వీసులనే తేడా లేకుండా దేనిలో చేరాలని అనుకున్నా ఈ ఆందోళనల భాగస్వామ్యం ఒక మాయని మచ్చగా ఉంటుంది. అయితే, రక్షణ రంగంలో ప్రభుత్వం తన భాగస్వామ్యాన్ని తగ్గించుకునేందుకు ఇదో మార్గంగా ఎంచుకున్నదని చాలా మంది భావిస్తున్నారు. నాల్గేళ్ళు మాత్రమే త్రివిధ దళాల్లో అలవెన్స్‌లతో కూడిన ఉద్యోగాలను ఇవ్వగలమని పభుత్వం చెప్పకనే చెబుతున్నట్టు అనిపిసోంది. మరి కొంత కాలం పోతే ప్రభుత్వ సంస్థలనేవి పూర్తిగా కనుమరుగు అవుతాయని వాదించేవారూ ఉన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతోనే ప్రభుత్వ సంస్థలను ఇప్పటికే చాలా రంగాల్లో నడుపుతు న్నారు. అందువల్ల ఉపాధి అనేది కచ్చితంగా దొరకడం చూసుకోవాలి కానీ, ఆందోళనలు కొనసాగిస్తూ పోతే ఏ కొలువులోనూ చేరలేని స్థితి ఏర్పడుతుంది. ఇది ఎంత వరకూ సమర్ధనీయమో ఆందోళనకారులు ఆలోచించా లి. ప్రభుత్వం ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామ ని చెబుతోంది కనుక, ఆందోళనకారులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. అయితే, బ్రిటిష్‌ వారి కాలం నుంచి రక్షణ రంగం కేంద్రం పరిథిలోనే ఉంది. వీటి రెజి మెంట్లకు బ్రిటిష్‌ వారు పెట్టిన పేర్లు ఇంకా కొనసాగుతు న్నాయి. అగ్నిపథ్‌ ఓ ప్రయోగం.దీని వల్ల ఎంత వరకూ మేలు జరుగుతుందనేది వేచి చూడటంలో తప్పు లేదు. మరో మార్గం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement