Thursday, November 21, 2024

ఆర్థిక వ్యవస్థకు ఓ మచ్చ!

మనీ ల్యాండరింగ్‌… ఈ మధ్య ఎక్కువగా విని పిస్తోన్న మాట. దీని వల్ల దేశప్రతిష్ట మంటగలిసి పోతోంది. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల వినియోగం వంటి రుగ్మతలను ఇది పెంచి పోషిస్తోంది. ఈ కేసుల్లో ఇరుక్కున్నవారు చాలా పెద్ద పెద్ద స్థానాల్లోనే ఉన్నారు. విదేశాల్లో దాచుకున్న బ్లాక్‌ మనీలేదా నల్లధనం దేశంలోకి తెచ్చుకోవడానికి మనీ ల్యాండరింగ్‌ తోడ్పడుతోంది, ఈ నేరాన్ని కట్టుదిట్టంగా నియంత్రించాలని ల్యాండరింగ్‌కి పాల్పడే వారిపై కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేసే వారే తమవరకూ వచ్చే సరికి ఈ చట్టం పౌరహక్కులకు విఘాతం కలిగిస్తుందని విమర్శించడం విచిత్రం, మనీ ల్యాండరింగ్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తోంది. సమాజానికి చేటుకలిగిస్తోంది. ఇది ఓ మాయని మచ్చ. మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో అనుమానితులను ప్రశ్నించేందుకు, వారి ఆస్తులను జప్తు చేసేందుకు, తగిన ఆధారాలుంటే అరెస్టు చేసేందుకు ఆర్థిక శాఖ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులకు తగిన అధికారాలున్నాయంటూ సుప్రీంకోర్టు బుధవారం నాడు స్పష్టం చేసి ఈ అంశంపై గడిచిన కొద్ది రోజులుగా కొనసాగుతున్న సంశయాత్మక పరిస్థితికి తెరదించింది. మనీ ల్యాండరింగ్‌ నేరమేననీ, దానిని అనుమతిస్తే ఉగ్రవాదులకు నిధులు చేరవేయడం, ఉగ్రవాదుల నుంచి నిధులను సేకరించి పంపిణీ చేయడం వంటి అక్రమాలు యథేచ్చగా సాగిపోతాయని జస్టిస్‌ ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌చట్టంలోని సెక్షన్‌ 19 కింద అధికారాలు ఏకపక్షమైనవి కావనీ, చట్టబద్దమైనవేనని కోర్టు స్పష్టం చేసింది. హవాలా వ్యాపారాన్ని, ఆర్థిక నేరాలను కట్టడి చేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారనీ, ఈ చట్టంలోని సెక్షన్‌ ఐదు కింద నిందితుల ఆస్తులను జప్తు చేసే అధికారం అధికారులకు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, ఈడీ అధికారులు పోలీసు అధికారాలను ప్రయోగించ డాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను బెంచ్‌ కొట్టి వేసింది. ఆర్థికనేరాలను వెలికితీసి, వాటిని అరికట్టేందుకు ఈడీఅధికారులకు ప్రత్యేక అధికారాలను ఈచట్టం కింద దఖలు చేయడం జరిగిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ చట్టంకింద పాత కేసులను తవ్వి అధికారంలో ఉన్న వారు రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకుంటున్నా రంటూ నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. మనీ ల్యాండరింగ్‌ అనే పదం ఇప్పుడు కొత్తగావాడుతు న్నప్పటికీ, విదేశాల నుంచి హవాలా మార్గాల ద్వారా తమ డబ్బును తెప్పించుకోవడానికి దేశంలో నల్లకు బేరులు ఏనాటి నుంచో అలవాటు పడ్డారు. ఇప్పుడు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తెచ్చుకోవడానికి మనీ ల్యాండరింగ్‌ రాజ మార్గంగా ఉపయోగ పడుతోంది, అయితే, రాజకీయ ఒత్తిడుల కారణంగా అవి పని చేయలేదు.

ప్రస్తుత ప్రభుత్వం దీనిని ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా తొలగించేందుకు కృత నిశ్చయంతోముందుకు సాగుతోంది. అయితే, రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. మనీ ల్యాండరింగ్‌ సాంఘిక, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని సమాజ హితైషులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలను తెప్పించుకునేందుకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతోంది. 2002 కి ముందు నాటి కేసులను ఈ చట్టం కింద విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఇది నిందితుల ప్రాథమిక హక్కులకు భంగకరమని పిటిషనర్లు వాదించారు. ప్రతిపక్షాలు అనుమానించడానికి అవకాశం ఉంది. నరేంద్రమోడీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈడీ అధికారులు ఈ చట్టం కింద 26 దాడులు నిర్వహించగా, 23 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయనీ ప్రభుత్వమే లోక్‌సభలో వెల్లడించింది.

అయితే, కొన్ని కేసుల్లో విచారణ ముందుకు సాగకపోవడం, శిక్షలు పడకపోవడాన్ని ఆసరాగా తీసుకుని ఈ చట్టాన్ని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులను వేధించడానికి ఆయుధంగా ఉపయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టం కింద నోటీసులు అందుకున్న వారు, ఆస్తులు జప్తునకు గురి అవుతున్నవారూ, అరెస్టు అవుతున్నవారూ ప్రతిపక్ష నాయకులే అవుతున్నారు. పూర్వపు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కూడా విదేశీ మారకద్రవ్య నిబంధనలను (ఫెరా) ఉల్లం ఘించారని ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేసేవారు విదేశాల నుంచి అక్రమంగా ధనాన్ని తరలించేందుకు ఉపయోగ పడుతున్న ఇటువంటి చట్టాలను కట్టదిట్టంగా అమలు జేయడం అవసరమే కానీ, కక్షలు, కార్పణ్యాలతో దర్యాప్తు సంస్థలను వినియోగించుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement