అరవై ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జై జవాన్- జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. దేశం లో కోట్లాది మందికి ఆహారాన్ని అందిస్తున్న రైతులకు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నామో, దేశ ప్రాదేశిక సరిహద్దు లను రక్షిస్తున్న జవాన్లకు కూడా అంత ప్రాధాన్యం ఇవ్వా లన్నది ఆయన నినాదం అర్థం. ఆ నినాదాన్ని మకుటం గా చేసుకుని సినీగీతాలు వచ్చాయి. సినిమాలొచ్చాయి. రైతుల సమస్యలపై జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకూ ఎన్ని పోరాటాలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు.జవాన్ల సమస్యలపై కూడా ఆందోళన లు జరుగుతున్నాయి. ప్రతికూలమైన పరిస్థితుల్లో విధు లు నిర్వహించే జవాన్లలో ఆత్మస్థయిర్యం కల్పించేందు కు ప్రధాని నరేంద్రమోడీ ఎత్తయిన మంచుకొండల్లో ఏటా వారితో కలిసి దీపావళి పండుగ జరుపుకునే వినూత్న సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ కూడా దానిని కొనసాగిస్తున్నారు. అయితే, ఏడాదికోసారి జవాన్లను కలిసి వారి భుజం తట్టినంత మాత్రాన సరిపోదు, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రక్షణ శాఖ పెన్షనర్లలో అసమానతలను తొలగించేందు కు చర్యలు తీసుకున్నారు. అలాగే, సైన్యంలో చేరాలన్న ఆసక్తి ఉన్నా, రిక్రూట్‌మెంట్లకు సకాలంలో హాజరు కాలే కపోవడమో, కొద్ది మార్కుల తేడాతో ఆ అవకాశాన్ని కోల్పోవడమో వంటి కారణాల వల్ల నిరాశానిస్పృహలకు గురి అవుతున్న యువకులకు దేశ సేవ చేసే సదవకాశా న్ని కల్పించేందుకు ఇటీవల అగ్నిపథ్ పేరిట ఒక పథకా న్ని ప్రవేశపెట్టారు.ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్లు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి.అగ్నిపథ్‌లో చేరే అగ్ని వీరులకు మామూలు సైనికుల మాదిరిగానే సౌక ర్యాలు లభిస్తాయని ప్రభుత్వం హామీ ఇచ్చినా నాల్గేళ్లు సేవలు చేయించుకుని వదిలేసే పథకం వల్ల యువకుల భవిష్యత్ అంధకారమవుతుందంటూ ప్రతిపక్షాలు గేలి చేశాయి.ఇప్పటికీ చేస్తున్నాయి.
అగ్నిపథ్‌పథకాన్ని చాలా కాలం ఆలోచనలు చేసి రూపొందించామని ప్రధాని వివరణ ఇచ్చారు. సైన్యంలో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పుడు నిర్బంధ సైనిక విధా నం అమలులోకి వస్తోంది.చైనా, రష్యాల్లో అయితే వేరే చెప్పనవసరం లేదు.డ్రాగన్ దేశం చైనాలో18 ఏళ్ళు పైబ డిన వారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఏ)లో పని చేయాల్సిందేనన్న నిబంధ న అమలు లో ఉంది. ఆ తర్వా త పూర్తి కాలం సైన్యంలో కొనసాగదల్చుకున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది.పదవీ విరమణ అనం తరం మాజీ సైనికులు,అధికారులు నెలకొల్పే పరిశ్రమ లు, సంస్థలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది.
ప్రభు త్వ సర్వీసుల్లో చేరదల్చుకున్న వారికి వారి అర్హతలను బట్టి ఆయా హోదాల్లో ఉద్యోగకల్పన చేస్తారు.ఈ పద్దతి మన దేశంలో కూడా ఉంది. రష్యాలో ఇంత నిర్బంధ సైనిక విధానం లేదు.అయితే, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ సైనికుల ను కొత్తగా చేర్చుకునే పద్దతిని ప్రవేశపెట్టింది. మన దేశం లో మాజీ సైనికుల పట్ల ప్రజల్లో ఎంతో గౌర వం ఉంది. మాజీ సైనికులు ప్రారంభించిన సంస్థలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మాజీ సైనికులు వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలను నడుపుతున్నారు. అందువల్ల అగ్ని వీరులుగా పని చేసి రిటైరైనవారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.దేశం కోసం పూర్వపు తరం వారు ప్రాణాలు అర్పించగా, ఇప్పుడు దేశాన్ని దోచుకుని తినేవారు ఎక్కువ మంది తయారయ్యారు.
ఈ పరిస్థితి నుంచి మార్పు కోసం నిర్బంధ సైనిక విధానం తప్పని సరి అని చాలా మంది భావిస్తున్నారు. దేశభక్తి, జాతీయాభిమా నం విషయంలో మన సైనికులు ఎవరికీ తీసిపోరు. గత ఏడాది పాక్ సరిహద్దులలోకి వెళ్ళి ఎఫ్- 16 యుద్ధ విమా నాన్ని కూల్చిన అభినందన్ వర్థమాన్ ఎంతో మందికి ఆదర్శ ప్రాయుడయ్యాడు. అతడిని పాక్ సైన్యం పట్టు కుంది, అయినా భయపడలేదు. అటువంటి సైనికులు, వాయుసేన కమాండర్లు దేశానికి అవసరమని ప్రధాని మోడీ పలు సందర్భాల్లో అన్నారు. పాక్‌పై మన దేశం అంతర్జాతీయంగా తెచ్చిన ఒత్తిడి ఫలితంగా పాక్ ప్రభుత్వం అతడిని విడుదల చేసింది.
అలాగే, లడఖ్‌లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాటంలో ప్రాణా లర్పించిన నల్లగొండ జిల్లాకి చెందిన బి సంతోష్‌బాబు ను దేశానికి గర్వకారణంగా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. సైనికుల వీరగాథలు నేటి తరానికి ఉత్తేజాన్ని ఇస్తాయి. నేతాజీ సుభాస్ చంద్రబోస్ స్వాతంత్య్ర సమరంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ)ని స్థాపిం చి ఎంతో మంది దేశభక్తి పౌరులను తయారు చేశారు. అలాంటి సుదీర్ఘ చరిత్ర గల మన దేశంలో మళ్ళీ సైనికుల రిక్రూట్‌మెంట్ పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.