Thursday, December 26, 2024

పోరు న‌ష్టం – పొందు లాభం…

వ్య‌క్తి నుండి ప్రపంచ స్థాయి వరకు సర్వకాల సర్వజనులకు అన్నింటా ‘పోరు నష్టం పొం దు లాభం’ అనేది వర్తిస్తుంది. ఎవరు ఎంత గా సమర్ధించుకున్నా ‘పోరు’ అనేది ఇరు ప్రక్కల వారి అపరిపక్వ ప్రకటిత ప్రతీక. దాన్ని వీలైనంతగా తగ్గించుకోవడం, లేక అసలు లేకుండా సర్వవిధాల ప్రయత్నించ డంలో వ్యక్తుల, వ్యవస్థల విజ్ఞత ఆధారపడి ఉంటుం ది. అది తప్ప మరో మార్గం లేదనటం, అనుకోవడం మేధో దారిద్య్రానికి ప్రబల నిదర్శనం. పోరు లేకపోవ టం కొంత వరకు ఉపశమనం. అంతకుమించి పొం దు ఉంటే ఇరు పక్షాలకు బహుళ ప్రయోజనం. ప్రశాం తత పరిఢవిల్లుతుంది. వివిధ స్థాయిలలో, అంశాల లో సమస్యా పూరిత విశ్వ సమాజ అస్తిత్వంలో దీని ఆవశ్యకత మరింత ఎక్కువ. దీనివలన ఒనగూరే సత్ఫలితాలన్నీ ఏదో రూపంలో అవనిలో అందరూ పొందగలరు. ఇందుకు అందరి చేయూత తమదైన రీతిలో అవసరం. ముఖ్యంగా ఇది దేశాల నడుమ అయితే ఆ దేశాల ప్రజలంతా ఘర్షణ లేని శాంతియు త సాంస్కృతిక పరస్పర తోడ్పాటుతో కాంతివంతం గా జీవనం గడప గలరు. ఈప్రాతిపదికన చూస్తే తాజాగా చైనా విదేశాంగ మంత్రి ‘వాన్‌ యి’ ప్రకటన ఎంతో ఉదాత్తంగా ఉంది. ఇరు దేశాల నడుమ ఎంతో కాలంగా ఏర్పడిన సంఘర్షణ,ఉద్రిక్తత వాతావరణా నికి చరమగీతం పాడే లాగా కనిపిస్తుంది. ఆయన ఆది వారం(7/3) నాటి ప్రకటనలో ‘రెండు దేశాలూ పర స్పరం విభేదాలను పరిష్కరించుకుని, సహాయ స#హ కారాలు పెంపొందించు కోవడం అన్నింటికన్నా ముఖ్యం’ అన్నారు. గత సంవత్సరంగా జరిగిన తప్పొప్పులు సరి#హద్దు విషయంలో స్పష్టమైనాయి. దీంతో సంఘర్షణ ఏ సమస్యని పరిష్కరించ లేదని తెలియ వచ్చినట్లు తెలిపారు. శాంతియుత వాతావర ణంలో సంప్రదింపులే సరైన పరిష్కార దిశగా ప్రయా ణం అన్నారు. తాము చర్చలు సంప్రదింపులకు బద్దు లమై ఉన్నామన్నారు. అదే సమయంలో తమ సార్వ భౌమత్వం, స్వీయ ప్రయోజనాలు కాపాడుకుంటా మని స్పష్టం చేశారు. ఆయన ఈ ప్రకటనను నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ వార్షిక పత్రికా సమావేశంలో చేశా రు. చైనా విదేశాంగ మంత్రి నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. మన సరి#హద్దు ఘర్షణ అనం తర పరిస్థితులపై పరస్పర ఉపయోగకర అంగీకార ప్రక్రియ మొదలైనప్పటి నుంచి చేసిన బహిరంగ ప్రకటన ఇది. ఇప్పుడు నెలకొన్న ఏకాభిప్రాయం పర స్పరం శక్తివంతం గావించి సంబంధాలను మెరుగు పరచాలని ఆయన రెండు దేశాలకూ పిలుపునిచ్చా రు. వచ్చే సంవత్సరంలో ఇండియా చైనాలు పరస్ప రం అర్థం చేసుకుని ఆటంకాలను తొలగించుకొని అవకాశాలను అభివృద్ధి కొరకు వినియోగించుకోగల రనడం ఎంతైనా హర్షనీయ పరిణామం. ఈ సంద ర్భంలోనే ఆయన’ మన రెండు దేశాలు అనేక అంశాల లో ఒకటే. లేక సమానత్వం కలవి’ అన్నారు. రెండు దేశాలు పరస్పరం స్నేహితులం, భాగస్వాములం. ప్రతిబంధకాలమూ.. శత్రువులమూ కాదు’ అని స్పష్టం చేశారు. పరస్పర సహాయ సహ‌కారాలు ఇరు దేశాల అభివృద్ధికి అవసరం. మనల్ని మనం అర్ధం చేసుకుని సహకారం పెంచుకోవాలి. అనుమానపు దృష్టి అంచనాలకు స్వస్తి పలకాలి. మన ఇరు దేశాల సంబంధాలు పటిష్టం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కాపాడి ప్రపంచ బహుళత్వాన్ని కొనసాగిస్తుంది’, అన్నారు. మాటల్లో ఎంతటి విజ్ఞత. ఆచరణ ఎంతవరకు అనేది కాలం చెప్తుంది. వారి మాటలు అంతిమంగా ఏ రూపం దాల్చినా, కొన్ని వాస్తవాలు విస్మరించరాదు. మన ఇరు దేశాలు సాం స్కృతిక పునాదుల ఏనాడో ఏర్పడ్డాయి. క్రీస్తుశకం నాలుగవ, ఏడవ శతాబ్దంలోనే పాహియాన్‌, హుయాన్సాం గ్‌ మన దేశానికి పవిత్ర యాత్ర కొచ్చారు. ‘కొందరికి కాశీ, మరికొందరికి జెరూసెలెమ్‌, ఇంకొం దరికి మక్కా’ లాగా వారికి మన దేశం బుద్ధిజం జన్మిం చిన, వికసించిన, బుద్ధునికి జ్ఞానోదయం కలిగించిన పవిత్ర భూమి గల దేశం. పాహియాన్‌ అప్పటి చంద్ర గుప్త విక్రమాదిత్యునిగా ప్రసిద్ధి గాంచిన రెండో చంద్ర గుప్తుని కాలంలో వచ్చినప్పటికీ ఆ రాజ్యం గురించి, రాజు గురించి ఏమాత్రం పట్టించుకోక తన పవిత్ర యాత్రను పూర్తి చేసుకుని వెళ్ళాడు. అదే ‘హుయాన్సాం గ్ హర్షుని కాలంలో ఇక్కడి నలందా విశ్వ విద్యాలయంలో మూడు సంవత్సరాలు విద్యనభ్య సించి బుద్ధిజంకు చెందిన అనేక ముఖ్యమైన మూల గ్రంథాల్ని వెంట తీసకొని వెళ్ళాడు. ఇరువురూ వారి పర్యటన అనుభవాల్ని గ్రంథస్తం గావించారు. అప్ప టి మన దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటారు. పైగా ఆ దేశ సాంస్కృతిక వికాసంలో తాత్విక పునాదులు అయిన ‘తావో, షింటో, కన్ఫ్యూషియస్‌’ లాంటి వారి తో పాటు మన దేశం నుండి తరలివెళ్లిన జెన్‌ బుద్ధిజం ప్రభావం కలిగి ఉంది. బోధి ధర్ముడు క్రీస్తుశకం 520 లో చైనా వెళ్లి ‘వజ్రచ్ఛేది గా సూత్రాలు’ ప్రచారం చేశా డు. అవి చైనా, జపాన్‌లలో అనేక సత్పరిణామాలి చ్చాయి. ఇవి, ఇలాంటివి పునరుద్ధరించుకుని అన్ని విధాల దౌత్య, వాణిజ్య సంబంధాలు మెరుగు పరచ కోవడం, వాటి వెలుగు పంచుకోవటం ఇరు దేశాలకు శాశ్వత అవసరమే. తద్వారా ప్రపంచానికీ. ప్రపంచం లో వాణిజ్యపరంగా ఒకప్పుడు మన దేశం ఇప్పటి అగ్రదేశాల మించి అత్యధిక వాటా కలిగి ఉండేది అన డానికి అనేక గణాంక వివరాలు సాక్ష్యాలు. వాటికి అప్పటిలో ఇతోధికంగా తోడ్పడింది ‘సిల్క్‌ రోడ్డు గా’ ప్రసిద్ధిగాంచిన చైనా మీదుగా వెళ్లిన మార్గమే ముఖ్య కారణం. సమకాలీన ప్రపంచ వాణిజ్యంలో, సైద్ధాం తిక, ప్రాంతీయ రాజకీయాలకతీతంగా స్వేచ్చ వాణి జ్య కూటములు ఏర్పడుతున్నాయి. పరస్పర ప్రయో జనాల కొరకు ద్వైపాక్షిక ఒప్పందాలు, బహుపాక్షిక రూపాలలో వేగంగా ఏర్పరచుకుంటున్నారు. అందు కు చైనాతో ఐరోపాలోని నాటో దేశాలతో సహా ఆఫ్రికా దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలు ప్రత్యక్ష నిదర్శనాలు. ఎవరికి వారు తమ దేశ ప్రయోజనాల లక్ష్యంతో ఒకప్పటిలా ఇతరేతర అంశాలన్నిటినీ పరిగణించడం లేదు. అం దుబాటులోని మౌలిక వసతులను, గొలుసు సరఫరా లను, ఆర్థిక, సాంకేతిక తోడ్పాట్లనూ అందిపుచ్చుకోవ డంలో అన్ని రకాల సంకోచాలకతీతంగా అత్యంత చొరవ చూపుతున్నాయి. ఇలాంటి వాస్తవ పరిస్థితు ల్ని హేతుబద్ధంగా పరిశీలించి సరైన వైఖరితో, దౌత్య వ్యవహారాలతో ఆర్థిక, వాణిజ్యాలు దీర్ఘకాల దృష్టితో, ఆచరణాత్మక వ్యూహాలతో దేశీయ ప్రయోజనాలను కాపాడుకోవాలి.
అన్నింట్లో అగ్రరాజ్యం అమెరికాకి అంటకాగే చైనా పొరుగు దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా లాంటివే గాక దూరపు ఆస్ట్రేలియా కూడా’ ఆర్సెప్‌’ పేరుతో 15 దేశాలు (ఆసియన్‌ ప్లస్‌ 5) వాణిజ్య కూటమిగా ఏర్ప డి పరస్పరం స్వేచ్చా వాణిజ్యానికి తలుపులు తెరిచా యి. ‘క్వాడ్‌’ నాలుగు దేశాల్లోని జపాన్‌, ఆ స్ట్రేలియా లు దీనిలో భాగస్వాములు. కానీ మన దేశం దానికి దూరంగా ఉంది. తిరిగి చేరడానికి ఇంకా గడువు ఉం ది. మారుతున్న పరిస్థితులలో ఈ నిర్ణయాన్ని పునరా లోచించాలి. అంది వచ్చిన అవకాశాలను వదులుకో రాదు. అన్ని విధాల మన జాగ్రత్తలో మనం ఉంటూనే స్నే#హ #హస్తాన్ని అందుకోవాలి. స్తబ్దత వీడి సమయా నుకూలంగా తీసుకునే సరైన నిర్ణయాలే సత్ఫలితాల ను ఇస్తాయి. తాజాగా మన ప్రధాని జపాన్‌ ప్రధానితో ఫోన్లో దీర్ఘ సంభాషణ గావించారు. ఏ రెండు దేశాల మధ్య సంబంధాలు అయినా మరొక దేశంతో సంబం ధాలకు అడ్డంకి కారాదు. ఇలాంటప్పుడే దౌత్య చతుర త నిరూపితమయింది. తాజాగా కాథలిక్‌ ప్రపంచ గురువు’ పోప్‌ ఫ్రాన్సిస్‌’ ఇరాక్‌ పర్యటనలో షియా అత్యున్నత గురువు ‘అయతుల్లా అలీ అల్‌ సిస్టోని’తో సమావేశమైన వార్త ప్రపంచ ద్రుష్టి నాకర్షించింది. ఈ సందర్భంలో వారి మాటలు అర్ధవంతమగా, ఆచర ణీయంగా ఉన్నాయి.’ధర్మం పేరిట ఉగ్రవాదం విల య తాండవం చేస్తుండగా ధర్మాన్ని విశ్వసించేవారు మౌనంగా ఉండటం భావ్యం కాదు’. వీటి నుండి ఎవ రి స్థాయిని బట్టి వారు ఎంతైనా గ్రహించవచ్చు. అన్ని రంగాలకి వర్తించనూ, అన్వయించనూ వచ్చు.
పాలనా పర వైవిధ్యం తప్ప అనేక విధాల ఇరు దేశా ల్లో సారూప్యత వివిధ రూపాల్లో ఉంది. రెండూ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలు. చైనా అం తకంతకు ఆర్థికంగా పటిష్టం అవుతూ అన్ని విధాల అగ్రరాజ్యాన్ని ఢీ కొంటుంది. అనేక దేశాలతో బలమై న ఆర్థిక వాణిజ్య సంబంధాలు ఏర్పరుచుకుంటుం ది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. వేగంగా,అధికంగా అభివృద్ధి చెందుతున్న, అనేక ప్రత్యేకతలు గల దేశం. ఇక్కడ అనేక ఉత్పత్తుల తయారీలో, దిగుమతులకు చైనాపై ఆధారపడి ఉ న్నాం. వాటన్నింటిలో స్వావలంబనకు కొంత కాలం పడుతుంది. ఈ లోపు వాటి నిరంతర సరఫరాలో అం తరాయం ఉత్పత్తిపై, వినియోగంపై, ఎగుమతులపై అపారంగా పడుతుంది. ఈ విషయాలన్నీ పరిగణలో కి తీసుకుని సత్వరం ఇరు దేశాల నడుమ చక్కటి సం బంధాలు పునరుద్ధరించాలి. తద్వారా ఇరుదేశాలలో ని ప్రజలు, వినియోగదారులు ప్రయోజనం పొందు తారని మరచిపోరాదు. పొరుగు దేశం కావడం వలన ఒకప్పటి సాంస్కృతిక సంబంధాలు మళ్లి బలపడతా యి. దేశాధినేతల విజ్ఞత పైనే ఆ దేశ ప్రజల దీర్ఘకాల, బహుళ ప్రయోజనాలు, శాంతి సుస్థిరతలు ఆధారప డి ఉంటాయి. ప్రతి సందర్భంలో అన్ని దేశాల వారు దీన్ని తెలుసుకొని మసలుకోవాలి.
మంచి మనసుతో, సక్రమ ఆలోచన గలవారు ఎవ రూ ‘పోరు’ కోరుకోరు. ఘర్షణ వాతావరణం ఎవరికి ఏ రూపంలోనూ మేలు చేయదు. అందరికీ అన్ని విధాల హానికరం. ఘర్షణ అంటే పక్కలో కత్తి పెట్టుకు ని పడుకోవడమే. భావోద్వేగాల ప్రేరణ సదాలోచనకు స్పూర్తినివ్వాలి. అహం, ఆవేశం, ఆతురత, ఆక్రోశం, పాక్షికతలు, సంకుచితత్వాలు, నియంతృత్వ ధోరణు లు విశాలత్వాన్ని, విజ్ఞతను, పరిణితిని, సదాలోచనా లను, సద్వర్తననూ హరించి వేస్తాయి. నక్కల సలహా లు కోరే ఎంతటి సింహమైనా వంచన పాలు గాక తప్ప దు. ఎవరికి రుచించినా, లేకున్నా ఎల్లప్పుడూ అంద రూ అందరి మంచి కోరా లి. కల్లోల కరోనా కాలంలో కావలసింది ‘కారుణ్యం’. కార్పణ్యం ఏమాత్రం కా దు. గాయపడ్డ కపోతాన్ని కాపాడిన ‘బుద్ధ భూమి’ ఇది అని మరవరాదు.

– బి ల‌లితానంద ప్ర‌సాద్..

Advertisement

తాజా వార్తలు

Advertisement