ED Summons | రూ.1.72 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ

ED Summons | రూ.1.72 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ

ED Summons | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) సంస్థ నుంచి ఆమెకు చెందిన ‘ఎక్సాలజిక్ సొల్యూషన్స్’ కంపెనీకి జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టింది.

సీఎంఆర్‌ఎల్ సంస్థ నుంచి ఎక్సాలజిక్ సొల్యూషన్స్‌కు సుమారు రూ.1.72 కోట్లు చెల్లించారని, అయితే అందుకు తగిన సేవలు అందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చెల్లింపులు అనుమానాస్పదంగా ఉన్నాయన్న అభ్యంతరాల నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ చేపట్టింది.

ఈ వ్యవహారానికి సంబంధించి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) చేపట్టిన దర్యాప్తును కర్ణాటక హైకోర్టు సమర్థించింది. అలాగే, ఈ కేసులో ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చని కేరళ హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు వీణా విజయన్‌ను విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, సేవల వివరాలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

Leave a Reply