Durgam Mallesham | విద్యుత్ భద్రత సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలి

Durgam Mallesham | విద్యుత్ భద్రత సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలి

  • విద్యుత్ సేఫ్టీ ఆఫీసర్ దుర్గం మల్లేశం.

Durgam Mallesham | దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భద్రత సూచనలు పాటించాలని డిఈ టెక్నికల్, విద్యుత్ సేఫ్టీ ఆఫీసర్ దుర్గం మల్లేశం అన్నారు. చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు దండేపల్లి మండల కేంద్రంలో ఏడిఈ ప్రభాకర్ రావుతో కలిసి రైతులకు, వినియోగదారులకు విద్యుత్ భద్రత పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ… విద్యుత్ పట్ల ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా రైతులు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే విద్యుత్ అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన తెగిపడిన విద్యుత్ తీగలను పంట పొలాల్లో కరెంటు వైర్లు తెగినప్పుడు ముట్టకూడదు. మోటారు స్టార్టర్‌కు ఎర్తింగు ఉండేలా చూడాలని పొలాల వద్ద ఇనుప స్టార్టర్ బాక్సులు వాడకూడదు అన్నారు. విద్యుత్ అనేది మనకు వరం. దానిని సరైన జాగ్రత్తలతో భద్రత సూత్రాలను పాటిస్తూ వాడితే ప్రమాదాలను నివారించి మన జీవితాలను సురక్షితంగా సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు అన్నారు. వినియోగదారులు సాధారణ ప్రజలు ఇండ్లలో కూడా విద్యుత్ పై చాలా జాగ్రత్తగా భద్రతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట ఏడిఈ ఎం ప్రభాకర్ రావు, ఏఈ బాపు సబ్ ఇంజనీర్ సాయి నరేష్, లైన్మెన్ మల్లేష్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply