చంచల్‌గూడ జైలు నుంచి డీఎస్పీ భీమ్‌రెడ్డి విడుదల

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెయిల్‌..
  • కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో.. జైలు అధికారులు విడుదల ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో మంగళవారం రాత్రి భీమ్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.