డీఎస్సీ భారీ బహిరంగ సభ వాయిదా..

ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాల (heavy rains) నేపథ్యంలో శుక్రవారం (18-09-25) జరగాల్సిన మెగా డీఎస్సీ (Mega DSC) భారీ బహిరంగ సభ(A huge public meeting)ను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. తిరిగి సభను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. గుంటూరులో భారీ వర్షాల(Heavy rains) కారణంగా అభ్యర్థులను రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నారు. డీఎస్సీలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ (Appointment Letters) ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.

సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. ఆయా జిల్లా కేంద్రాల నుంచి బస్సుల(buses)లో అభ్యర్థులను అమరావతికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థితో పాటు తోడుగా వచ్చే మరొకరికి పాసులను కూడా సిద్ధం చేసింది. ఈరోజు సాయంత్రానికి ప్రభుత్వం (Govt) కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా ఈలోగా సభ వాయిదా పడినట్లు అభ్యర్థులకు ఫోన్లు వస్తున్నాయి. వర్షాలు తగ్గాక మరో రెండు రోజుల్లో తిరిగి సభను నిర్వహించాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు(Education officials) వెల్లడించారు.

Leave a Reply