Drug-free | అమ్మాలన్నా.. కొనాలన్నా భయపడాలి..

Drug-free | అమ్మాలన్నా.. కొనాలన్నా భయపడాలి..

  • డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చేదిద్దుదాం..
  • బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్

Drug-free | బాపట్ల క్రైమ్, ఆంధ్రప్రభ : జిల్లాలో గంజాయి అమ్మాలన్నా.. కొనాలన్నా భయపడేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని, బాపట్లను గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చేదిద్దటానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్(Umamaheshwar) కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గంజాయికి సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా ఉంచటం జరిగిందని చెప్పారు. ఇక ద్వారా వచ్చిన సమాచారంతో గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం పై ప్రత్యేక దృష్టి పెడ్తామ‌ని చెప్పారు. అందులో భాగంగా విక్రయదారులపై వినియోగదారులపై కేసులు నమోదు(Registration of cases) చేశామన్నారు. నిఘా మరింత విస్తృతం చేశామన్నారు. జిల్లాలో ఎక్కడైనా సరే గంజాయి విక్ర‌యించినా.. వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.

Leave a Reply