చింతకోళ్ల గ్రామానికి ట్యాంకరుతో తాగునీటి సరఫరా..

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు క్రమం తప్పకుండా త్రాగునీటి సరఫరా


కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండల పరిధిలోని చింతకోళ్ల గ్రామానికి వాటర్ ట్యాంకరుతో త్రాగునీరు సరఫరా చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు కోడూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు వాటర్ ట్యాంకరుతో తాగునీటి సరఫరా చేస్తున్నారు.

గురువారం ఉదయం చింతకోళ్ల గ్రామానికి నాలుగు వేల లీటర్లు సరఫరా చేశారు. సాయంత్రం కూడా నాలుగు వేల లీటర్ల త్రాగునీరు సరఫరా చేయనున్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచన మేరకు గత వారం రోజుల నుంచి క్రమం తప్పకుండా త్రాగునీటి సరఫరా కొనసాగిస్తున్నట్లు రాంబాబు తెలిపారు.