Rukmini Vasanth: శర్వానంద్‌కి జంటగా‘డ్రాగన్’ బ్యూటీ..!
Rukmini Vasanth: సంక్రాంతి హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. ‘నారీ నారీ నడుమ మురారి’ లభించిన ఘన విజయం అనంతరం.. ఈ క్రమంలోనే సీనియర్ దర్శకుడు శ్రీను వైట్లతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆయన ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను పట్టాలెక్కించబోతున్నారు. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరనే దానిపై ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో విపరీతమైన చర్చ సాగుతోంది.
శర్వా సరసన రుక్మిణి వసంత్..?
‘కాంతార’ ప్రాజెక్ట్‌తో పాటు కన్నడ, తెలుగు భాషల్లో విశేష గుర్తింపు పొందిన రుక్మిణి వసంత్ పేరు ఈ చిత్ర కథానాయికగా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీని, శ్రీను వైట్ల సినిమాలో హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రుక్మిణి ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, ఆమె పాన్-ఇండియా ఇమేజ్ చిత్రానికి మరింత అదనపు గ్లామర్, క్రేజ్ తీసుకొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పోటీలో ఆషికా రంగనాథ్..
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ రేసులో కన్నడ అందం ఆషికా రంగనాథ్ పేరు కూడా విపరీతంగా ప్రచారంలో ఉంది. ఇటీవల రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో హిట్ అందుకుని, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆషికా కూడా ఈ కథకు చక్కగా సరిపోతుందనే టాక్ ఉంది. శ్రీను వైట్ల కామిక్ వినోదానికి సరిపడేలా ఉండే ఈ ముఖ్య పాత్ర కోసం ఈ ఇద్దరి భామల్లో ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప శర్వానంద్‌తో జోడీ కట్టే ఆ లక్కీ బ్యూటీ ఎవరనే దానిపై పూర్తి స్పష్టత రానుంది.
