యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను కలిసిన డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హైదరాబాదులోని ఆదర్శనగర్‌లో న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అఖిలేష్ యాదవ్‌ను కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, మేధావులు, విద్యావంతులు, అధికారులు ప్రజాస్వామ్య పరిరక్షణకు, లౌకికవాదాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు గతంలో ఆర్టీఐ సమాచార కమిషనర్‌గా, ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులుగా ప్రజాసేవలో చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మందడి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మందడి అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

Leave a Reply