మీర్‌పేట్‌లో జంట హత్యలు..
- కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సిద్ధిఖ్ అనే వ్యక్తి తన అత్తింటి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నిరంజన్ బి., రేష్మాగా గుర్తించారు. నిరంజన్ బి. నిందితుడి అత్త కాగా, రేష్మా అతడి బావమరిది యూసుఫ్ భార్యగా తెలుస్తోంది. దాడి అనంతరం నిందితుడు సిద్ధిఖ్ పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
