- ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ సహా
- కమాండ్ కంట్రోల్ రూమ్‌తో నిఘా
- తిరుమలలో 10 చెక్ పోస్టులు
- పార్కింగ్ జోన్లు .. ఘాట్ రోడ్‌తో తనిఖీలు
- చిన్నపిల్లలకు ట్యాగ్ లైన్లు ఇద్దాం
- బ్రహ్మోత్సవాల్లో సమన్వయంతో పనిచేద్దాం
- తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమీక్ష
తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి జరగనున్నశ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల(Srivari’s annual Brahmotsavam)కు భారీ బందోబస్తుపై తిరుపతి పోలీసులు కసరత్తు ప్రారంభించారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలో పిన్ టూ పిన్.. నిఘా వ్యవస్థకు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అన్ని శాఖల్నిసమన్వయం చేసుకోవటానికి కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే రచించారు. ఈ మేరకు తిరుపతిలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ(District SP), హర్షవర్ధన్ రాజు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, అన్నిశాఖ అధికారులతో సమన్వయం సహకారంతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని తమ శాఖ అధికారులకు దశ దిశా నిర్దేశనం చేశారు. ఏదైనా సమస్య వస్తే అధికారులు అందరూ సమన్వయంతో కలిసి నిర్ణయం తీసుకుంటే పరిష్కారం(solution) దొరుకుతుందని తెలిపారు.
బాలాజీ నగర్ తో పాటు పాప వినాశనం ఏరియాలో నాకాబందీ నిర్వహించాలని ఆదేశించారు. భక్తులతో ఏ విధంగా మెలగాలో ఆటో డ్రైవర్లు(auto drivers) జీపు డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమాన్నితిరుమల డీఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.
తిరుమలలో ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాన్నినిర్వహించాలన్నారు. 400 మంది పోలీస్ సిబ్బంది(police personnel)తో క్రౌడ్ కంట్రోల్ ఏవిధంగా చేపట్టాలనే అంశంపై అదనపు ఎస్పీ. ఆర్ముడ్ రిజర్వ్ అవగాహన కల్పించాలని సూచించారు.
అగ్నిమాపక శాఖ, విద్యుత్తు శాఖలతోనే చర్చించామని, ఏ రీతిలో వ్యవహరించాలో ఓ ప్రణాళికను సిద్ధం చేసినట్టు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ సమయలో తిరుమల లో ఏ రూట్ లో వెళ్లాలి అనేదానిపై క్లియక్లియర్‌గా రూట్‌ను రెడీ చేయాలని ఆదేశించినట్టు ఎస్పీ వివరించారు.
విపత్తుల నియంత్రణ శాఖతో జాయింట్ ఆపరేషన్ చేయాలన్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ తో పాటు కమాండ్ కంట్రోల్(Command Control) రూమ్‌ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ రద్దీ సమయంలో ఏ రీతిలో వ్యవహరించి, అదుపు చేయాలో ఏర్పాటు ట్రాఫిక్ పోలీసులు సిబ్బందికి వివరించినట్టు ఎస్పీ తెలిపారు.
తిరుపతి తిరుమలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని, ఏ పార్కింగ్ స్థలంలో ఎన్నివాహనాలు ఉంచగలమో అనే విషయవపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎస్పీ తెలిపారు. డం జరుగుతుందన్నారు.
తిరుమలలో పది చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ప్రతి సెక్టార్‌లో సీసీ కెమెరాలు సహా సోలార్ సీసీ కెమెరాలు(Solar CCTV Cameras) ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు దర్శనం అనంతరం ఎలా వెళ్లాలి అనే అంశాన్ని కీలకంగా తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు.
శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్లు ప్రాంతాల్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడితే ఏ ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి అనే దానిపై ముందుగా ప్లాన్ చేస్తామన్నారు. అలిపిరి శ్రీవారి మెట్లు(Srivari Steps) మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
లేపాక్షి, అఖిలాండం, నాలుగు మాడ వీధుల్లో బందోబస్తును నిర్వహించాలని, రెండు ఘాట్ రోడ్‌లో కూడా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్(Dog Squad), తో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. రోప్ పార్టీలను కూడా సిద్ధం చేయాలని, తిరుమలలో చిన్నపిల్లలు తప్పిపోకుండా ట్యాగ్ లైన్ లను ఏర్పాటు చేయాలన్నారు.
టీటీడీ విజిలెన్స్ పోలీస్ శాఖతో కలిసి సమన్వయంతో పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్సీ రవి మనోహర్ ఆచారి, ఆర్మూర్ రిజర్వ్ అదనపు ఎస్సీ శ్రీనివాసరావు(Sp Srinivasa Rao), స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జొన్నగడ్డ వెంకటనారాయణ, టౌన్ డీఎస్పీ భక్తవత్సలం, క్రైమ్ డీఎస్పీ శ్యాంసుందర్, డీఎస్పీ తిరుమల విజయ్ శేఖర్, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి, స్పెషల్ బ్రాంచ్ సీఐ సాదిక్ ఆలీ అధికారులు పాల్గొన్నారు.