అన్ని విధాలుగా ఆదుకుంటాం..
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్: వరంగల్ (Warangal) పరిధి ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ కాలనీలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. సహాయక చర్యలు పరిశీలించి, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో పాటు పలువురు పాల్గొన్నారు.

