అమ్మవారికి బంగారు హారం కానుక

రూ.1.20 లక్షల విలువైన స్వర్ణాభరణం సమర్పించిన దాత ఉపద్రష్ట శ్రీనివాస్

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారికి స్వర్ణ కానుక సమర్పించారు. విజయవాడ ఎస్‌.ఎన్‌.పురానికి చెందిన దాత ఉపద్రష్ట శ్రీనివాస్‌ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి 20.020 గ్రాముల బంగారు నెక్లెస్‌ను భక్తిశ్రద్ధలతో కానుకగా అందజేశారు. దీని విలువ సుమారు రూ.1.20 లక్షలు. ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ గాంధీ, డిప్యూటీ ఈవో కిషోర్‌కుమార్‌, ఇతర అధికారులకు దాత ఆభరణాన్ని అందించారు. వీరికి అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన అనంతరం అర్చకులు దాత కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.