కనకదుర్గమ్మకు రూ.4.50 లక్షల విరాళం

కనకదుర్గమ్మకు రూ.4.50 లక్షల విరాళం

ఉచిత ప్రసాదం, గో సంరక్షణ పథకాల కోసం విరాళం.

ఇంద్రకీలాద్రి ,ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనక దుర్గ అమ్మవారి సేవార్థం భక్తులు విరాళం అందజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన కోటిరావు, అంజు కుమారి కుటుంబ సభ్యులు దేవస్థానానికి మొత్తం రూ.4.50 లక్షలు విరాళంగా అందజేశారు.ఈ విరాళంలో భాగంగా నిత్య ఉచిత ప్రసాద పథకం కోసం రూ.2.25 లక్షలు, గో సంరక్షణ పథకం కోసం మరో రూ.2.25 లక్షలు అందజేశారు. దాతలు ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ను కలిసి అంజు కుమారి, తనీషి రావు పేరుపై విరాళ చెక్కును అందజేశారు.


వీరికి అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయక వేద ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.

Leave a Reply