పెడనలో మునిసిపల్ వార్డుల విభజనకు లైన్ క్లియర్

23 నుంచి 28 వార్డు పెంపు

పెడన, ఆంధ్రప్రభ : పెడన మున్సిపల్ పరిధిలో వార్డుల పునర్విభజనకు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. పెడన మున్సిపల్ పరిధిలో ఇకపై 23 వార్డుల నుంచి 28 వార్డులకు పెరగనున్నాయి. పట్టణ జనాభాను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పెడన పట్టణంలో గతంలో ఉన్న 23 వార్డులను 28 వార్డులుగా విభజన చేశారు.

అయితే వార్డుల పునర్విభజన సక్రమంగా జరగలేదని 23 వార్డులనే కొనసాగించాలని ఓ మాజీ ప్రజాప్రతినిధి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినట్లు విశ్వసినియవర్గాల సమాచారం. మాజీ ప్రజాప్రతినిధి వేసిన పిటిషన్లు కోర్టు కొట్టి వేసినట్లు తెలిసింది. మున్సిపల్ అధికారులు రూపొందించిన విధంగా ఇకపై పెడన మున్సిపల్ పరిధిలో 23 వార్డుల నుంచి 28 వార్డులకు పెరగనున్నాయి.