రథాన్ని లాగిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..

రథాన్ని లాగిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ (కోటంచ) లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవంగా జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి పెద్దరథంలొ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఊరేగించారు. స్వామి వారి రథాన్నిలాగిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జాతరలో ప్రత్యేక ఆకర్షణంగా ప్రభ బండ్లు, ఏనుగు వాహనాలు, తిరుగుట కోలాహలంగా నెలకొంది. బుధవారం వివిధ ఘట్టాలు కొనసాగాయి.
నిత్యనిధి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారిని జోగయ్యపల్లి నుంచి ఏనుగువాహనం పై డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ కోటంచకు తీసుకొచ్చారు. ఏనుగు వాహనాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ప్రభబండ్లు, గుర్రం, మేక వాహనాలతో ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ జాతరలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, ఈవో మహేష్, డిఏస్పి సంపత్ రావు, సర్పంచ్ చావటి మొగిలి, సీఐలు కర్ణాకర్ రావు, మల్లేష్ యాదవ్, ఎస్సైలు, రాజేష్, దివ్య, త్రిలోక్ నాధ్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మనులు మాదాడి అనిత- కరుణాకర్ రెడ్డి, కోలుగూరి రాజేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
