ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : స్థానిక 60వ డివిజన్ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్,సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని రంజాన్ పండుగ రానున్న నేపథ్యంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తుందని, మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తోఫా కిట్లను అందజేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గ ధన శేఖర్, డివిజన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, మల్లేశ్వరరావు,బుదాల సురేష్,ఆకుల సూర్యప్రకాష్, డిడి నాయుడు తదితరులు పాల్గొన్నారు.స్థానిక 58వ డివిజన్ సింగ్ నగర్ ప్రాంతంలో మక్కా మసీదులో రంజాన్ సందర్భంగా ముస్లిం సహోదరులతో కలసి ఎమ్మెల్యే బొండా ఉమా నమాజులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కూర్మపు దుర్గారావు, ఇంచార్జి పిరియా సోమేశ్వరరావు,సుర్విపల్లి అమర్నాధ్ గౌడ్,మైనార్టీ అధ్యక్షుడు గౌస్ భాషయాదగిరి ,ఆకుల సూర్యప్రకాష్,కంచేటి నాగరాజు, డిడి నాయుడు,బుదాల సురేష్,యాకుబ్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply