విద్యార్థులకు ఉచితంగా టై, బెల్టుల పంపిణీ
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మాసం శ్రీనివాస్ గౌడ్ తన మాతృమూర్తి దివంగత మాసం లక్ష్మి జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా టై, బెల్టులను పంపిణీ చేశారు. గురువారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరిధర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజన్న మాట్లాడుతూ.. శ్రీనివాస్ గౌడ్ తాను పనిచేస్తున్న పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి నిరంతరం కృషి చేయడం అభినందనీయమన్నారు. సొంత ఖర్చులతో విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడం ఆయన సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవన్న, రంగాచారి, కిషన్, సుమలత, శిరీష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
