టెన్త్ క్లాస్ స్టూడెంట్ కు పెన్నులు, పరీక్ష ప్యాడ్ల పంపిణీ

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ ; భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో నేటి నుండి ప్రారంభమయ్యే టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ప్రోత్సాహకంగా పెన్నులు, పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ మేస కార్తీక్ తమ్ముడు మేస కపిల్ తనవంతుగా విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తూ ఈ విద్యా సామగ్రిని అందజేశారు.
బెజ్జోరా సర్పంచ్ మేస కార్తీక్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ మూడేల్ల లింబయ్య చేతుల మీదుగా విద్యార్థులకు ఈ సామగ్రిని అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
పరీక్షల సమయంలో ధైర్యంగా, ఏకాగ్రతతో ప్రశ్నలకు సమాధానాలు రాయాలని, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, బెజ్జోరా వార్డ్ మెంబర్ దివాకర్, గ్రామ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
