వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
జైనూర్,ఆంధ్రప్రభ: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లోని మారుమూల కొలం గ్రామంలోని పనపాటర్‌లో బుధవారం వయోవృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ( ఏఎమ్ డబ్ల్యూఎస్)తలసేమియా జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్, మండలకోఆర్డినేటర్ ఆత్రం మాధవరావు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన జయంతి మేడం ప్రత్యేక చొరవతో, వారి మిత్రులు కమల్ సింగ్ సురానా, రాజు కొత్తారి, రాజేష్ సేథియా, శ్రేణిక్ గోల్చా ల ఆర్థిక సహకారంతో ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో గ్రామంలోని వయోవృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశామని తెలిపారు.
ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. చలికాలంలో వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా దుప్పట్లు అందించడం సంతోషంగా ఉందని, పేద గిరిజన కుటుంబాలకు సేవ చేయడమే ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆత్రం తులసి శంకర్, ఉపసర్పంచ్ ఆత్రంభీంరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి (కారోబారి) ఆత్రం జగన్ గ్రామంలోని వయోవృద్ధులు పాల్గొన్నారు.
