నేటి నుంచి నట్టల నివారణ మందుల పంపిణీ
నేటి నుంచి నట్టల నివారణ మందుల పంపిణీ
- ఈ నెల 7 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం
- 20 మండలాల్లో అమలు.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం
వికారాబాద్, నవంబర్ 2 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లాలో పశువులకు నట్టల నివారణ మందులు వేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఈ నెల 7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం తెలిపారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేటలో పశువులకు నట్టల నివారణ మందులు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్య పరిరక్షణకు నట్టల నివారణ మందులు ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది హాజీ పాషా తదితరులు పాల్గొన్నారు.
