260 మంది విద్యార్థులకు ఉచిత మెగా ఆరోగ్య శిబిరం

  • వైద్య పరీక్షలతో పాటు రూ.1.66 లక్షల విలువైన నోట్‌ పుస్తకాల పంపిణీ

చౌటుప్పల్‌, ఆంధ్రప్రభ : చౌటుప్పల్‌ మండలంలోని కైతాపురం, ఎల్లగిరి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, మల్కాపూర్‌ గ్రామంలోని జోసెఫ్‌ వెబర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 260 మంది విద్యార్థులకు శనివారం దివీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఎల్లగిరి గ్రామ సర్పంచ్‌ రిక్కల మహేందర్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డాక్టర్‌ జయంత్‌కుమార్‌, డాక్టర్‌ నరేష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వైద్య సూచనలు అందించారు.

అదేవిధంగా విద్యార్థులకు రూ.1,66,088 విలువైన నోట్‌ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యకు తమ వంతు సహకారం అందించడంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు దివీస్‌ ప్రతినిధులు తెలిపారు.

కార్యక్రమంలో ఏపీఎంఓ చైర్‌పర్సన్‌ సుమలత, కె. అలివేలు, సెక్రటరీ బ్రాహ్మణి, ప్రధానోపాధ్యాయులు విజయదుర్గ, అనిత, జె. కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, దివీస్‌ ప్రతినిధులు బి. గోపి, జి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.