విద్యుత్తు సరఫరాకు ఆటంకం…
ఒంగోలు రూరల్, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో జిల్లాలోని పలు గ్రామాలు అంధకారంలో మగ్గాయి. దీంతో నగర గ్రామీణ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఒంగోలు నగర శివారులోని కొప్పోలు ప్రాంతం అంధకారంగా మారింది.
అదేవిధంగా ఒంగోలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కు అంతరాయం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి లోట్రానివ్వమని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం జరగకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఏదేమైనప్పటికీ జిల్లావ్యాప్తంగా బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి.

