పోలీసు ఆయుధాల ప్రదర్శన

పోలీసు ఆయుధాల ప్రదర్శన

విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించిన చిత్తూరు ఎస్పీ

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ఆదివారం జిల్లా ఏ.ఆర్ పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఏఆర్ పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి, మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా వర్ణించారు. పోలీసుల కష్టసాధ్యమైన విధులకు సవరణ పొందేలా చేయడం లక్ష్యంగా పేర్కొన్నారు. పోలీసు విభాగంలోని ప్రతీ విభాగం తీరుపై అవగాహన కలిగించడం ద్వారా విద్యార్థుల్లో సమాజ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయుధాల వినియోగ విధానాలు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధం వాడవలసి ఉంటుందో, ఆ ఆయుధం ఎలా పనిచేస్తుందో విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌లిగించారు.

ఆయుధ ప్రదర్శనలో
ప్రదర్శనలో వివిధ విభాగాలను ఆకర్షణీయంగా అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసు దర్యాప్తుల్లో డాగ్ స్క్వాడ్ పాత్రను ప్రదర్శించారు. పోలీస్ బలగాలు వినియోగించే ఆయుధాలు, వాటి వినియోగ పద్ధతుల గురించి వివరించారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్ విభాగంలో అత్యవసర పరిస్థితుల్లో బాంబులను గుర్తించే విధానాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. కమ్యూనికేషన్ విభాగంలో పోలీసుల మధ్య సమాచార మార్పిడి విధానాలు, ఆధునిక రేడియో పరికరాల ప్రదర్శన చేసారు. కార్యక్రమంలో పోలీస్ వాహనాల ప్రదర్శన కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఫాల్కన్ వాహనం, మినీ ఫాల్కన్ వాహనం సహా ఇతర పోలీసు వాహనాలు ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శివానందకిషోర్, చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్పీ టి.సాయినాథ్, ఏ.ఆర్. డీఎస్పీ లు చిన్ని కృష్ణ, మహబూబ్ బాష, 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర, క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వర రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, ఆర్.ఐ లు సుధాకర్, వీరేశ్, ఎస్సైలు, ఆర్.ఎస్సైలు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply