హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)ను అసెంబ్లీ (Assembly)లో ప్రవేశ పెట్టామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister N. Uttam Kumar Reddy)తెలిపారు.. దీనిపై సాయంత్రం నాలుగు గంటలకు చర్చ మొదలవుతుందన్నారు. ఫ్లోర్ లీడర్ల (Floor Leaders)కు నివేదికకు సంబంధించిన హార్డ్ కాపీలు.. సభ్యులకు సాఫ్ట్ కాపీలు ఇచ్చినట్లు చెప్పారు. రెండు గంటల పాటు విరామం ఇచ్చి ప్రిపేర్ అయ్యాక చర్చిస్తామన్నారు. కేసీఆర్ (KCR) తరఫున నివేదిక హార్డ్ కాపీని హరీశ్ రావు(Harish Rao)కు ఇచ్చినట్లు వివరించారు.
మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం
మున్సిపల్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశముంది.