Discovery | పుస్తక ఆవిష్కర‌ణ

Discovery | పుస్తక ఆవిష్కర‌ణ

Discovery | ఘంటసాల, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya)ను టీడీపీ నేత తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), అచ్చెంపాలెం సర్పంచ్ గాజుల శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద్భంగా వారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

అనంతరం తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా) తనయుడు తేజేంద్ర కుమార్ రచించిన “దివిసీమ గాంధీ(Diviseema Gandhi) – మండలి వెంకట కృష్ణారావు” అనే పుస్తకాన్ని బండారు దత్తాత్రేయ తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వారి వెంట మాదాసు వినయ్, డాంగే కుమార్ తదితరులు ఉన్నారు.

Leave a Reply