హైదరాబాద్ : హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమస్టర్‌డామ్ షిపోల్ విమానాశ్రయానికి నేరుగా విమాన సర్వీస్‌ను కేఎల్‌ఎం రాయల్ డచచ్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పటికే బెంగళూర్, ఢిల్లి, ముంబై నుంచి నేరుగా అమ్‌స్టర్‌డామ్‌కు విమాన సర్వీస్‌లు నడిపిస్తోంది.
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, భారత ఫార్మా రాజధానిగా ఉందని, అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఉన్నాయని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ చెప్పారు. కేఎల్‌ఎం భారత్ నుంచి వారానికి 22 విమాన సర్వీస్‌లను నడుపుతోందని, శీతాకాలంలో వారానికి 27 సర్వీస్‌లు నడుపుతుందని తెలిపారు.