గుండెపోటుతో మృతి..
సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామానికి చెందిన చాకలి శంకర్(Washerman Shankar) అనే వ్యక్తి గుండెపోటుకు గురై ఈ రోజు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్ గా విధులు నిర్వహించి అందరితో కలుపుగోలుగా ఉండేవాడని తెలిపారు.
గ్రామస్తులతో పాటు విద్యుత్ శాఖ(Electricity Department)లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించినట్లు తెలిపారు. ఆపరేటర్ చాకలి శంకర్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శంకర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. అంత్యక్రియ కార్యక్రమాలలో అధికారులు, రజక సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

