Diabetes | ముందుగా గుర్తిస్తే..
Diabetes, హైదరాబాద్, ఆంధ్రప్రభ – మధుమేహాం వల్ల గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలు, పాదాలు వంటి అవయవాల పై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరించారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని వారు స్పష్టం చేశారు. ముందస్తుగా గుర్తించడం వలన అవయవాలను, ప్రాణాలను కాపాడవచ్చని డాక్టర్లు తెలిపారు. నేడు (నవంబర్ 14) మధుమేహ (Diabetes) దినోత్సవం సందర్భంగా సంపూర్ణ మధుమేహ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాంపల్లిలోని ప్రవైట్ హాస్పటల్ లో సీనియర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎ. ముక్సిత్ క్వాద్రి మాట్లాడుతూ.. డయోబెటిస్ అనేది కేవలం రక్తంలో చక్కెర పెరగడం మాత్రమే కాదు.. ఇది శరీరంలోని ప్రతి అవయ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.
దీన్ని నిర్లక్ష్యం చేస్తే..గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, కంటిచూపు తగ్గడం నరాల సమస్యలు, పాదాలు గాయాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ ముందస్తు పరీక్షలు, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు అన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అవసరమన్నారు.
వాస్కులర్ అండ్ ఎండో వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ ఐఆర్, పొడియాట్రిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ అండ్ హెచ్ ఓడీ డాక్టర్ పి.సి. గుప్తా మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రతి 30 సెకన్లకోసారి డయోబెటిస్ (Diabetes) కారణంగా ఒకరు కాలు కోల్పోతున్నారని తెలిపారు. వీటిలో చాలా వరకు సరైన సమయంలో చికిత్స , జాగ్రత్తలు తీసుకుంటే.. పూర్తిగా నివారించవచ్చు అన్నారు. డయోబెటిస్ సమస్యలను ముందస్తుగా గుర్తిస్తే కాళ్లను మాత్రమే కాదు.. ప్రాణాలను కూడా కాపాడవచ్చని తెలిపారు.

