చేసింది ఎవరు..? డిమాండ్ ఏంటి..?
రెంజల్, (ఆంధ్రప్రభ): రైతులకు తడిసిన ధాన్యానికి 20 శాతం మాయిశ్చర్ ఉన్న కొనుగోలు చేయాలని, మొంథా తుఫాన్ వలన నష్టపోయిన పంటలను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ఏర్పాటు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్ (Parvati Rajeshwar) డిమాండ్ చేశారు. శనివారం మండల తహాసీల్థార్ కార్యాలయం ఎదుట ఏఐయుకెఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పుట్టి నడిపి నాగన్న, గుమ్మల గంగాధర్ లతో కలిసి పార్వతి, రాజేశ్వర్ మాట్లాడారు. మొంథా తుఫాన్ కారణంగా రైతులకు తీవ్ర పంట నష్టం వచ్చిందని, కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని, తక్షణమే యుద్ద ప్రతిపాదికన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఖరీఫ్ సీజన్ (Kharif season) లో గత సెప్టెంబర్ తొలుతలో వరి, సోయాపంటలు నీట మునిగిన తీవ్రంగా నష్టపోయాయన్నారు. వందల ఎకరాల్లో ఇసుక మేడలు పెట్టాయని అన్నారు. ఐకెపి, సహకార సంఘాలు వరి ధాన్యం, సోయాబీన్ కొనుగోలు చేయాలని, రైతులకు ఇప్పటికైనా బ్యాంకుల్లో క్రాప్ లోను తీసుకున్నవారికి రెన్యువల్ చేయాలని, బ్యాంకార్లు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని పార్వతి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చగా కందకుర్తి, నీలా, తాడ్బిలోలి, బోర్గం గ్రామాల రైతుల వరి, సోయా, పత్తి పంటలు వందలాది ఎకరాల్లో నష్టపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి కల్పించుకొని పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి షేక్ నజీర్, ఓడ్డెన్నా, ఎల్.గంగాధర్, సిద్ధ పోశెట్టి,జబ్బర్, నాగోల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

