Friday, November 15, 2024

Last Test : ధ‌ర్మ‌శాల‌లో జీరో ఉష్ణోగ్ర‌త‌లు…చివ‌రి టెస్ట్ పై తీవ్ర ప్ర‌భావం..

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత్ , ఇంగ్లండ్ జట్లు మళ్లీ తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే ఒక గేమ్ మిగిలి ఉండగానే 3-1 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరగడం అనుమానంగానే ఉందని అంటున్నారు. ధర్మశాల వాతావరణమే ఇందుకు కారణం. ఇండో-ఇంగ్లండ్ ఐదో టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముందని, దీనికి తోడు నగరంలో చాలా చల్లని వాతావరణం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.

నివేదిక ప్రకారం ‘వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. వర్షంతో పాటు హిమపాతం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపవచ్చని నివేదిక పేర్కొంది. ఇక మ్యాచ్ కోసం ఇంగ్లండ్‌, భారత్‌ జట్లు ఆదివారం ధర్మశాల చేరుకోగా.. నేడు ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ చేశాయి..

బౌల‌ర్ దే డామినేష‌న్ ..
ధర్మశాల స్టేడియంలో ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. అలాగే టాప్ ఆర్డర్ బ్యాటర్లు వికెట్లు పడకుండా చాలా జాగ్రత్తగా ఆడాలి. టాస్ గెలిచినప్పుడు భారీ స్కోర్ చేయడం కష్టం కాబట్టి, టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడం ఉత్తమ ఎంపిక. కాంగ్రా లోయలోని ధౌలాధర్ శ్రేణిలో 1,457 ఎత్తులో, గంభీరమైన హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో క్రికెట్ స్టేడియం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రీడా మైదానం. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ) స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న ఐదో టెస్టు రవిచంద్రన్ అశ్విన్ కి వందో టెస్టు మ్యాచ్‌. దీంతో 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 14వ భారత, రెండో భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కనున్నాడీ సీనియర్ స్పిన్నర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement