హైదరాబాద్, ప్రభన్యూస్: సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో యుగయుగాలపాటు రామానుజాచార్యుల సిద్ధాంతం ప్రజలకు తెలుస్తూనే ఉంటుందని, 216 అడుగుల భారీ విగ్రహం విష్టాద్వైత సిద్ధాంతకర్త మరో అవతారంగానే భావిస్తున్నానని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం లో జరుగుతున్న భగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహంలో గురువారంనాడు 9వ రోజు కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రవ చన మండపంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రామానుజాచా ర్యుల చరిత్రను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామానుజా చార్యుల విశాల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన త్రిదండి చినజీయర్ స్వామీ జీ, మైహూంగ్రూప్ అధినేత డా క్టర్ జూపల్లి రామేశ్వరరావును అభినందించారు. రామానుజాచార్యుల శిష్యుల్లో అన్నికులాలకు చెందినవారున్నారన్నారు. తనకు గురువు చెప్పిన ముక్తిమంత్రాన్ని గుప్తంగా పెట్టకుండా అందరి ముందూ ఆలపించారన్నారు. తాను నరకానికి వెళ్లినా ఫర్వాలేదని.. వేలాది మందికి ముక్తి లభిస్తే చాలని చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులన్నారు. లోకకళ్యాణం కోసం హిందువుల ఐక్యత కోసం రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారన్నారు. భగవద్రామానుజులు వైష్ణవ సంప్రదాయాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేశారని, కులాల గోడలు బద్దలు కొట్టి అసమా నతలను రూపుమాపేందుకు కృషి చేశారన్నారు. భక్తిలో సమాన త్వాన్ని చాటిచెప్పార న్నారు. ప్రపంచమం తా రామానుజాచార్యుల ఉపదే శాన్ని వ్యాప్తి చేయాలని అభిలషించారు.
సనాతన ధర్మాన్ని రక్షించారు : శ్రీశ్రీ రవిశంకర్
ఆదిశంకరాచార్యులు, రామానుజా చార్యులు, మ ద్వాచార్యులు భారత సనా తన ధర్మాన్ని కాపాడేందుకు విశేష క-ృషి చేశారన్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవి శంకర్‌జీ అన్నారు. భారత విద్యార్థులకు ఆధునిక విద్యతోపాటు ఆధ్యాత్మికతను జోడించి బోధించాల్సిన అవసరముందున్నారు. 108 దివ్యదేశాలను ఒకేచోట ప్రతిష్టించడం గొప్ప విషయ మన్నారు. వెయ్యేళ్ల క్రితమే అన్నిజాతుల ప్రజలను ఆలయ ప్రవేశం చేయించిన సమతామూర్తి సంకల్పం మహూన్నతమైనదన్నారు.
చినజీయర్ కల సాకారం : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహ ఏర్పాటుతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ స్వప్నం సాకారమైం దని, రామానుజులను పాలకు లు ఆద ర్శంగా తీసుకుని ప్రజలకు సమన్యాయం చేయాలని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సూ చించారు. కాగా దేశం గర్వపడేలా మంత్రి రాజ్‌నాథ్ నిర్ణయాలు తీసుకుంటున్నారని త్రిదండి చిన్నజీయర్ అన్నారు. రాజ్‌నాథ్ మార్గనిర్దేశంలో భారత ఆర్మీ శక్తివంతంగా తయారైందన్నారు.
సమతా ప్రాంగణంలో కలయతిరిగిన వీవీఐపీలు
కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆలయ విశేషాలను, సమతా మూర్తి ప్రాంగణ విశిష్టతను త్రిదండి చినజీయర్‌స్వామీజీ, మైహూంగ్రూప్ అధి నేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు వివరిం చారు. అనంతరం డిజి టల్ గైడ్, త్రీ డీ లేజర్ షో ద్వారా రామా నుజుల జీవితచరిత్రను తెలుసుకున్నారు. సమతామూర్తి ప్రాంగ ణంలో మొక్కలు నాటారు. యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. రాజ్‌నాథ్ సింగ్‌కు త్రిదండి చిన జీయర్ స్వామీజీ మంగళాశాసనాలు అందించారు. అనంత రం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్, శ్రీశ్రీ రవిశంకర్‌జీకి రామానుజాచార్యుల ప్రతిమలను బహూకరించి త్రిదండి చినజీయర్ స్వామీజీ, మైహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. సత్కరించారు.