Saturday, November 23, 2024

యుగావతారి శ్రీ సత్యసాయి బాబా

(నవంబరు 23వ తేదీన భగవాన్‌ శ్రీసత్యసాయి బాబా 95వ జయంతి సందర్భంగా బాబా వారి దివ్య సందేశం)

విశ్వం యావత్తు భగవాన్‌ శ్రీ సత్య సాయిబాబా వారి అవతార పురుషు నిగా గుర్తించడం సకల మానవాళి అదృష్టం. జగద్గురువుగా, ఆధునిక యుగానికి ప్రక్షా ళనకర్తగా మానవాళి పరిగణించింది. ఆధ్యాత్మిక జగతికే. ఆచరణకర్తగా, సేవా దురంధ రునిగా, సంఘ సంస్కరణకర్తగా బాబా వారి జీవన యాత్ర సాగింది. ఆధ్యాత్మికత- మానవ అస్తిత్వం. ఈ రెంటికి అవగాహన కల్పిం చిన దైవం. ”నా జీవితమే నా సందేశం” అని ప్రవచించిన మహనీయ పురుషుడు బాబా. బాబావారి దివ్య ప్రవచనములు సకలలోకానికే ఆదర్శం. మార్గదర్శకం. సమస్త ఆధ్యాత్మిక విజ్ఞాన సారాంశమే అవ తార పురుషుని దివ్య సందేశం. ప్రతి వ్యక్తి లో మానవతా విలువలు అంతర్లీనంగా వుంటా యి. వాటిని బయటకు తెచ్చుట అనగా కార్య రూపంలోనికి తీసికొని వచ్చుటేయన్నారు. ప్రకృతిలోని సమస్త విషయములు ఎంతో పవిత్రమైనవని బాబా వారు స్పష్టం చేశారు. సమస్త విషయముల మధ్య కల స్వాభావికమైన దివ్య సంబంధమును అర్థం చేసుకోవాలన్నారు.
సృష్టిలోని అన్ని రూపాల్లో పరమాణువు నుండి, మహా వస్తువు వరకు అన్నింటిలో దివ్య త్వం ఉంటుంది. ప్రకృతి అంతటా అది వ్యాపిం చి ఉంటుందనే సందేశం అందించారు. ధర్మం గురించి వివరిస్తూ సమస్త వస్తువుల నడవడిక ను పరిపాలించే న్యాయసూత్రం ఒక్క ధర్మమే అన్నారు. ప్రకృతిలో శాంతి- సమరసభావం- సౌందర్యం ప్రకృతిలో ప్రదర్శితమవుతాయనీ, సూత్రాలలో అతిక్రమణ ఉండదనీ అంటూ, సృష్టిలోని విలువల సంపూర్ణ ప్రకటన మూలం గా పంచభూతాలు సరియైన సమతౌల్యాన్ని కలిగి ఉంటాయన్నారు. సత్‌- చిత్‌- ఆనందములనునవి అంతర్గ తమై యుండి మార్పు చెందని గుణాలుగాని నిలుస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్యవంతుడైన మనిషిలో పంచభూత ములు సమతౌల్యం కల్గియుంటాయనీ, మానవ శరీరం స్వీయ క్రమబద్దీకరణ విధానం కల్గి ఉం టుందనీ తెలిపారు. మానవుడొక్కడే చైతన్యంతో తన స్వభావమును పరివర్తన చేసుకోగలడనీ బాబా వారి సందేశం. మానవుని శక్తి సామర్ధ్యాలను పేర్కొంటూ, మానవుడి కొక్కనికే దానవత్వాన్ని జారిపో గల్గిన శక్తి అయినా, లేక మాధవత్వానికి ఎదగ గలిగే శక్తి అయినా ఉన్నది. మనిషి తనకున్న విశిష్ట మేధా శక్తితో, జ్ఞాపక శక్తితో తన దృక్పథాన్ని విశాలం చేసుకొని సమాజం పట్ల తన ప్రతి స్పందననూ మార్చుకుని, అనుభవ జ్ఞానంతో లాభం పొందగలడు. జీవ రాసులో మానవుడే ఉన్నతుడు. తన తత్వమును పరిశీలించుకొని తనలోనితనలోని దివ్యత్వాన్ని, నిజ తత్వము ను తెలిసికొను శక్తి మానవునికి మాత్రమే ఉంది. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అం టూ, మానవ జన్మ చాలా అరుదైనదన్నారు. మానవుడు అన్ని రంగాలలో పురోగమ నం సాధించాడు. భోగ భాగ్యాల కోసం పంచ భూతాలను విపరీతంగా వాడుకున్నాడు. ఎన్ని వున్నా మానవునికి శాంతి సంతోషాలు లభిం చడం లేదు. అందుకు పరిష్కారంగా మనని మనమే బాగు చేసుకోవాలి. అదే విశ్వ శాంతికి , సుఖ సంతోషాలకు దారి తీస్తుంది. హృదయం లో ధర్మం. శీలంలో సౌందర్యం, గృహంలో సామరస్యం ఉంటే దేశంలో సువ్యవస్థ సుస్థిర మౌతుందనీ, అప్పుడే దేశంలో శాంతి విరాజ మానమౌతుందనీ, దైవం వైపు త్రిప్పితే ముక్తి లభిస్తుందనీ వివరించారు. సదాలోచనలు జ్ఞానేంద్రియాలకు చేరి మంచివాక్కులు, మంచి దృశ్యములుగా, మంచి పనులుగా, మంచి వినికిడిగ మారుతా యన్నారు. ఇంద్రియాల ద్వారా మంచి అను భవాలు ప్రవేశించి మనసు సద్భావములతో నిండిపోతుంది. మన ఆలోచనలే మన చర్య లకు బీజములు అన్నారు. మానవులకు బంధ నాలుగా ఉన్న కలుషితమనస్సు- దురాలోచ నలు- దుష్కార్యములు. వీటిని నిర్మూలించే య త్నం చేయాలి. మనసులో మంచి ఆలోచన వచ్చినప్పుడు దానిని ధృఢంగా పట్టి వుంచు కొని కార్య రూపంలో పెట్టాలి. మన భావనలలో సదాలోచన- సత్కార్యం- శుద్దమైన మనస్సు నిండియుండాలి. నీ భావన ఎలా ఉంటే అలానే తయారవుతావు అంటూ, మనం ఎలా తయా రు కావాలనుకుంటామో అలాంటి దానిలో దృఢ విశ్వాసంతో ప్రారంభించాలి. మంచి భవి ష్యత్తుకోసం దృఢ విశ్వాసాన్ని అభివృద్ది చేసు కోవాలి. అపుడే మానవుని ఆశయం నెరవేరు తుంది. మనో వాక్కాయ కర్మలను ఏకీ కృ తం చేసే శక్తిని అభివృద్ది పరచుకోమన్నారు బాబా. మంచి ఆలోచనలు, మంచి మాటలు- మంచి పనులు చేస్తే అవి ఒక్కటిగా ఉంటూ మన జీవి తంలో సమైక్యం కావాలన్నారు. ప్రతి జీవి ఆధ్యాత్మిక హృదయం కల్గి, నైతిక విలువలకు స్థానం ఇవ్వాలన్నారు. ఆలోచన లను హృదయం గుండా పంపుటే పరివర్తనం. జీవితం ఆదర్శం అగుటకు బాహ్య విషయాలకు సంబంధించిన జ్ఞానం అవసరం. బుద్ది ఈ శక్తిని రూపొందిస్తుంది. హృదయం అంతరంగిక జ్ఞానాన్ని కలిగించి బయటకు కొనివస్తుంది. ఈ రెండు జ్ఞానములను రూపొందించినప్పుడు జీవితం ఆదర్శవంతమవుతుందని చెప్పారు.
విచక్షణా జ్ఞానంతో మంచి ఆలోచనలను చేయమన్నారు. ప్రతి పనికి ధృఢ సంకల్పం కావాలంటూ, అంతర్గత విలువలు ధర్మ శీలత లో ప్రకటించబడతాయనీ, వాటిని సేవా రూపంలో సమాజానికి అందించమన్నారు. సంఘంలో విధి నిర్వహణ చాలా అవసరమని నొక్కి వక్కాణించారు. నిజమైన భక్తిని తెలుపుతూ అహంకారమే లేకుండా ప్రతి పనికీ నిన్ను నీవు అంకితం చేసు కుంటే భక్తి ఉద్భవిస్తుంది. నీలో నీవు క్రమ శిక్షణ పెంపు చేసుకోమన్నారు. దృఢ సంకల్పాలతో దివ్యత్వాన్ని పొందమన్నారు. మానవునిలోని దివ్యత్వాన్ని సోహం ప్రకటిస్తుంది. నిశబ్దపు లోతులలోనే భగ వంతుని వాణి వినిపిస్తుంది. అదే జ్యోతి ధ్యానం. బాబావారి సందేశాలు మహా వాక్యా లు- నిరంతరం అందరూ గుర్తుంచుకోవాల్సిన దివ్య వాక్కులు. దైవ ప్రీతి – పాప భీతి- సంఘ నీతి అనే వాటిని జాగరూకతతో గమనించ మన్నారు. బాబా వారి దివ్య సందేశ వాక్కులు సకల జనతకూ, యువతకూ ఆదర్శంగా కలకాలం నిలుస్తాయి. మానవతా విలువలైన సత్యం , ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలతో జనులు సుఖ శాంతులు పొంది తరించాలనీ భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా వారు దివ్య ఆశీస్సులందించుట మానవాళి అదృష్టం. సదాశయములతో సాయిబాటలో పయనిద్దాం. ధన్య జీవులవుదాం.

– పివి సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement