మన భారత భూమి వేద భూమి. సంస్కృతి ,సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక భావనకు, ధర్మస్వరూపంనకు పెట్టింది పేరు. దాదాపు ఐదువేల సం.రాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ అర్జును డుకు ఉపదేశించిన భగవద్గీత ద్వారా మనకు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల నిర్దేశత్వం చేసారు. శ్రీకృష్ణుని అవతార రహస్యం మన జీవన విధానా నికి రెండు కళ్ళుగానే ప్రసిద్ధి పొందాయి. అటువంటి ధర్మమార్గాన్ని, భక్తి తత్త్వాన్ని ప్రజలకు విశిద పరచడానికి మన తెలుగు నేలమీద కూడా అనేకమంది యోగి పుంగవులు జన్మించారు. రమణ మహర్షి, పుట్టపర్తి సత్యసాయి, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఇలా ఎందరో కారణజన్ములు. వారు చూపిన మార్గము మనకు ఆదర్శనీయము. ఇటువంటి కోవలోనే జన్మించినవారు బూర్లె రంగన్న బాబు, చివటం అచ్చమ్మవంటి అవధూతలు వున్నారు. వీరి గురించి మనలో చాలామందికి తెలియదు.
బూర్లె రంగన్నబాబు (1895 – 1979 )
రంగన్న బాబు గారి స్వస్థలం ప్రకాశం జిల్లా. ఆయన తండ్రి పుల్లయ్య. తల్లి జాలమ్మ. బ్రతుకు తెరువు నిమిత్తం ఏలూ రు వ లస వచ్చారు. బరకాలు, గోనెసంచులు కుట్టి. సంసారాన్ని, పిల్లలను పోషించేవారు. రంగన్నబాబుకు చదువుకోలేదు. అందుకని తండ్రి జూటుమిల్లులో మంచినీళ్ళు కావిడి మోయడానికి పనిలో పెట్టాడు. ఖాళీ సమయాల్లో కొంతమందికి కూడా కావిడ్లతో నీటిని మోసేవాడు. ఆ రోజుల్లో నీటికి ఇబ్బంది పడేవారు. ఇలా నీటికావిడులతో నీళ్ళు మోసి ఖాళీ దొరికిన ప్పుడు ఓ చెట్టుక్రింద కూర్చొని, వీరబ్ర హంద్రస్వామిపై పాటలు పాడు కొంటుండగా, ఒక యోగి ఇతనిని సమీపించి, ”నాతో వస్తావా? పుణ్య క్షేత్రాలు చూపిస్తానని” అంటే, రంగన్నబాబు కనీసం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండానే ఆ యోగితో వెళ్ళిపోయారు. తరువాత ఇంట్లో వాళ్ళు కంగారుపడి, వెదికిినా ప్రయోజనం లేదు. ఆ యోగి పుణ్యక్షేత్రాలు తిప్పి త్రివేణీ సంగమంలో (ప్రయాగ) జరుగుతున్న కుంభాభిషేకానికి తీసు కొచ్చి, అక్కడే ఉన్న ఒక అఘోరా చేత జ్ఞానోదయం కల్పించారు. అప్పటి నుండే రంగన్నబాబు ‘రామధ్యానం’ చేస్తూ, శ్రీరామ భక్తుడై పోయాడు. నిరంతరం ధ్యాన సమాధిలోనే ఉంటుండే వాడు. తిరిగి రెండు సం.రాలకు ఏలూరు వచ్చి, తన వృత్తిని మళ్ళీ మొదలెట్టినా, రామధ్యానం మానలేదు. తరువాత గుంటూరులోని జూటుమిల్లుకు నీరు సరఫరాకై వెళ్ళాడు. ఒకరోజు పోలియోతో బాధపడుతూ కర్రల సహాయంతో నడుస్తున్న ఒక బాలుడిని చూసి రంగన్న కర్రలు తీసి నడవమని సూచించాడు. వెంటనే ఆ బాలుడికి పోలియో పోయింది. బజారులోని ఒకరు తన వ్యాపారం సాగట్లేదని, తగిన ఉపాయం చెప్ప మని కోరితే, నువ్వు శ్రీరామనామాలు రాసిన దండను కొట్టుముందున్న గుమ్మానికి కట్టమని సూచించాడు. రాముని కొలుస్తూండమని చెప్పా డు. తర్వాత, ఆ వ్యాపారం బాగా సాగుతున్నట్లు బాబుకు తెలిపారు. ఈయన ప్రభావం తెలిసి భక్తులు దర్శనార్థం వస్తుంటే, ఒక ఫొటో గ్రాఫర్ కూడా వచ్చి, ఆయన ఫొటో తీసి, కడిగి చూస్తే, నల్లగా ఉంది తప్ప, ఆయన ఫొటో లేదు. అపుడు తన మిత్రునికి విషయం తెలిపితే ఆయన అనుమతి లేకుండా తీస్తే అలాగే ఉంటుదన్నారు. మర్నాడు మళ్ళీ వెళ్ళి, రంగన్నబాబు అనుమతితో తీస్తే, బాబుగారి గుండెల్లో కోదండరాముడు కొలువైనట్లు వచ్చింది. తర్వాత మళ్ళీ ఏలూరు వచ్చారు. శ్రీ ఎక్కిరాల భరద్వాజుడుగారు ప్రచురిస్తున్న సాయి మాసపత్రిక లో ఈయన గురించి రాస్తే, శ్రీ ఎక్కిరాల వేదవ్యాస్‌గారు గుర్తించి, ఆయన వద్దకు వచ్చి దర్శనం చేసుకొని ఆధ్యాత్మిక, తాత్విక విషయాలు మాట్లాడుకొన్న తరువాత, మీ చేతుల మీదుగా ప్రసాదం తినాలని ఉందంటూ వేదవ్యాస్‌గారు కోరితే,, రంగన్నబాబు ఆకా
శం లోకి చేయిచాపితే ఒక మధురమైన పండు వచ్చింది.
అప్పుడు వేదవ్యాస్‌గారు ఇదేమిఫలం? అనడిగితే ఇది ”త్రి విక్రమ ఫలం” అని బదులు ఇచ్చారు. పిల్లలులేని వారికి సంతాన యోగం, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం, ఇలా ఎన్నో మహిమలు చూపిన రంగన్న ఎప్పుడూ రామనామాన్ని వదల లేదు. ఆయన వద్దకు వచ్చిన వారితో జన్మకర్మలు, తాత్విక, ఆ ధ్యాత్మిక, విషయాలు మాట్లాడేవారు. ఆయన గురించి చాలామందికి తెలియదు. ఆయన అనుగ్రహంతో పుట్టిన సంతతి ఇప్పటికీ ఏలూరు, గుంటూరులలో ఉన్నారు. ఇంత చేసినా, తనకు ఏమీ లేకపోయినా, ఎవ్వరి వద్ద నుండి ఏమీ స్వీకరిం చలేదు రంగన్నబాబుగారు.
శ్రీమతి చివటం అచ్చాయమ్మ
పూర్వ జన్మ సంస్కారంవల్ల, సాధారణ గృహిణులు, పురుషులు ఎవరైనా, ఆధ్యాత్మిక సాధనలో మహోన్నత స్థితికి చేరుకొంటారని చెప్ప డానికి ఎంతోమంది, అవధూతల జీవితాలే మనకు ఆదర్శం. అటు వంటి కోవలోకే చేరిన అవధూత ”శ్రీ చివటం అచ్చమ్మ అవధూత.” సాధు అమ్మగా ప్రసిద్ధిగాంచిన దిగంబర యోగిని చిఇవటం అమ్మ ప.గో.జిల్లా తణుకు తాలూకాలో వున్న రేలంగి గ్రామంలో ఒక సామా న్య కుటుంబంలో జన్మించిన అచ్చమ్మ తండ్రి పేరు భద్రయ్య. అచ్చమ్మ చిన్నప్పటి నుంచి దైవచింతనలోనే ఉండేది. దేవాలయాల్లో కార్యక్ర మంలో పాల్గొంటూ, కనపడ్డవారందరితో, మనకు ఎప్పటికైనా ఆ భగ వంతుడే దిక్కు. అందుకే ఇప్పటినుండే భగవతారాధన అలవాటు చేసుకోండి అని చెప్పేది. ఆమెకు వయస్సు రాగానే దగ్గరలోని చివటం గ్రామ కాపురస్థుడు అంజయ్యకు ఇచ్చి వివాహం చేసారు. తర్వాత ఆ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. భర్త బాధ్యతారాహిత్యంగా తిరిగినా ఇరుగుపొరుగు ఇండ్లలో పనిచేసి భర్తకు, బిడ్డకు వండిపెట్టే వారు. భర్త దుర్మార్గుడై కొట్టినా పల్లెత్తుమాట అనేవారు కాదు. ఆమెకు రామనామమంటే ప్రీతి. ఎప్పుడూ సమయం వృధాచేసేవారు కాదు. రామనామాన్ని స్మరిస్తూ వుండేవారు. ఖాళీ దొరికితే ధ్యానానికి కూర్చొ నేవారు. 12 సం.రాలు మౌనవ్రతం చేస్తూ ధ్యానంలో నిమగ్నమైపో యారు. అక్కడ ఎన్నో లీలలు ప్రదర్శించేవారని ఇప్పటికీ చెప్పుకుం టారు. ఒకరోజు కొడుకును తన తల్లికి అప్పజెపి ఇల్లు విడిచిపెడుతూ, తన కన్నబిడ్డను దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా మంచి విషయాలు చెప్పి, బాగా చదువుకోమని సూచించింది. నీకు అమ్మను ఎప్పుడు చూడాలనిపించినా మనస్సులో తలచుకో. నేను వెంటనే నీ ఎదుట ఉంటానంది. రాజమండ్రి స్త్రీల మఠంలో కొంతకాలం వుండి, చివటం చేరారు. చివటంలో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన్మయస్థితిలో బట్టలు కూడా జారిపోతున్నా తెలియని స్థితిలో వుండేవారు. ఒకరోజు జారిపోతున్న తన చీరను తీసి ఒక బాలునిపై వేసి అప్పటినుండి దిగం బరంగా వుండిపోయారు. అమ్మ చివటం సమీపంలో జమ్మిచెట్టు కింద ధ్యానం చేసుకుంటుండేవారు. ఎవరయినా అడిగితే కాయలు కాయని చెట్టు కింద కూర్చోవాలి అదే జన్మరాహిత్యం అనేవారు. ఒకసారి సాధూ రాం బావాజీ శిష్యుడైన హఠయోగి అప్పారావుగారు అమ్మ దర్శనానికి వచ్చి ఆమె కాళ్ళు పట్టుకొని మొక్కుతుంటే, అమ్మ ఆయన కాళ్ళు పట్టుకొంది. అప్పుడు ఆయనతో మనం అందరం ఆ పరమేశ్వరుని స్వరూపాలే. అని చర్చించింది. ఇలా ఆమెలోని ప్రతిభను గుర్తించి ఎంద రో సాధువులు, ఆధ్యాత్మిక వేత్తలు దర్శించుకున్నారు. ఆమె భర్త మర ణించినా వెళ్ళలేదు. అమ్మ ఆపధ్బాంధవి. భక్తులను కనిపెట్టి ఉండేది. ఆమె అనుగ్రహముతో సంపదలు, ఆయురారోగ్యాలు కలిగాయి. ఆకలి తో ఉన్న ఓ వ్యక్తికి మట్టికుండలో చెయ్యి పెట్టి వేడివేడి అన్నం వడ్డిం చింది. ఒక రైతు ఆవుదూడతో సహా పారిపోతే, ఆమెను ఆశ్రయించారు. ఆపుడామె ”నీ గోవు ఇంటికి చేరింది. ఒక చెంబుడు పాలు గుళ్ళో ఇమ్మ” ని చెప్పింది. ఇంటికి వెళ్ళి చూస్తే ఆవు వచ్చేసింది. మారెడ్డి శ్రీరాములు కు జ్వరం వచ్చి తగ్గకపోతే, మనిషిని అమ్మ దగ్గరకు పంపేసరికి, ఆయన జ్వరం తగ్గిపోయింది. ఇలా ఎన్నో మహిమలు ప్రదర్శించింది. ఆమె 86-8-1 స్వర్గస్థురాలైంది. అమ్మ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరాన్ని విడిచారని చెబుతారు. చుట్టుపక్కల వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచ రణ ద్వారా చూపిన అమ్మ పాదపద్మాలకు మన సారా నమస్కరించుకుందాం.
- అనంతాత్మకుల రంగారావు
7989462679