Friday, October 4, 2024

యోగేశ్వరేశ్వరుడు- శ్రీకృష్ణుడు

సంజయ ఉవాచ

యత్ర యోగేశ్వర: కృష్ణ: యత్ర పార్థో ధనుర్ధర:|
తత్ర శ్రీర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ||
(శ్రీమత్‌ భగవద్గీత అధ్యాయం: 18 శ్లోకం: 78 )

తాత్పర్యం: ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, అక్కడ విజయము, శ్రేయస్సు, సంపదలు, ఐశ్వర్య ము, వాటితో పాటు ధర్మము, నీతి, దృఢంగా, స్థిరం గా ఉంటాయని నా అభిప్రాయము అని సంజయు డు ధృతరాష్ట్రునితో చెప్పాడు.

వివరణ : దీని అర్థం, కృష్ణార్జునులు పాండవుల పక్షంలో ఉన్నారు, ఆ కారణం చేత పాండవులు ఈ యుద్ధంలో విజయం సాధిస్తారు. వారికి రాజ్యము, రాజ్యసంపదలు, శ్రేయస్సు కలుగుతాయి. వారి వెం టనే ధర్మము, నీతి ఉంటాయి. ఇది నా అభిప్రాయ ము అని సంజయుడు యుద్ధ పరిణామాలను ముం దే ఊహంచి చెప్పాడు. దీనికి బాహ్యమైన కారణం కూడా ఉంది. కౌరవ పక్షాన వారికి వెన్నుదన్ను అయిన భీష్ములవారు పది రోజుల యుద్ధం చేసి పడి పోయారు. దానితో పాండవులు సగం విజయం సాధించినట్టు. మిగిలిన సగం విజయం పాండవుల స్వంతం అవుతుంది ఎందుకంటే ధర్మం, యోగేశ్వ రుడు అయిన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జును డు వారి పక్షాన ఉన్నారు. నీ కొడుకులు ఈ యుద్ధం లో గెలుస్తారు అన్నది ఒట్టి మాట. ఇంతవరకు నీవు నీ కుమారుడు సుయోధనుడు యుద్ధంలో గెలుస్తా డు. రాజ్యాధికారం పొందుతాడు. చక్రవర్తి అవుతా డు అనే అపోహలో ఉన్నావు. అది నిజంకాదు. అలా ఎన్నటికీ జరగదు. నీ కుమారులు అధర్మపరులు కా బట్టి ఈ యుద్ధంలో వారికి పరాజయము కలగక తప్పదు. ధర్మరాజు చక్రవర్తి కావడం తథ్యం. ఇదీ సంజయుల వారి ఆఖరి మాటలు.
ఇది గీతలో ఆఖరు శ్లోకము అద్భుతమైన శ్లోక ము. అర్థవంతమైన శ్లోకము. అర్జునుడు ధనుస్సు ధరించి ఉన్నాడు. కృష్ణుడు యోగేశ్వరుడు. యోగు లకు ఈశ్వరుడు. యోగమును అభ్యసించినవాడు. యోగమునే ఆయుధముగా కలవాడు. ధనుస్సుతో బయట ఉండే శత్రువులను నాశనం చేయవచ్చు. కా ని యోగముతో అంత: శ్శత్రువులను చంపవచ్చు. ఆ ఆయుధము కృష్ణుని వద్ద ఉంది. బాహ్య శత్రువుల ను నాశనం చేసే ఆయుధం ధనుస్సు అయితే, అంత: శత్రువులను చంపే ఆయుధం యోగము. ఈ రెండు ఒకచోట ఉంటే కలిగే ఫలితం తత్ర శ్రీ విజయోభూతి అన్నాడు పరమాత్మ. అక్కడ విజయం, ఐశ్వర్య ము, సంపద లభిస్తుంది. అంటే బాహ్యశత్రువులు, అంత: శత్రువులు నశిస్తే మోక్షము, పరమశాంతి అనే విజయం ఐశ్యర్యము లభిస్తుంది. కాబట్టి కృష్ణా ర్జునులు ఉన్నచోట బాహ్య విజయము అంతర్విజ యము తప్పకుండా లభిస్తాయి. అనంత ఐశ్వర్యా లు లభిస్తాయి. పరమ శాంతి సుఖము లభిస్తాయి.
ఇక్కడ యత్రయత్ర అని వాడారు. అంటే ఎక్క డైతే అని అర్థం. ఎక్కడ అనే దానికి సమాధానం సగుణారాధన పూజామందిరంలో పటం పెట్టుకోవ డం వాటికి భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వర్తించ డం. బాహ్యంగా కృష్ణార్జునులను వారి ప్రతిమలను పూజిస్తుంటే ఆ ప్రదేశంలో పవిత్రత, శాంతి నెలకొం టాయి. వాటితోపాటు, ప్రతి మానవుని మనస్సులో అర్జునుడు, కృష్ణుడు ప్రతిష్టింపబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి వాడికీ సంతోషం కావాలి, విజ యం కావాలి. శాంతి కావాలి. ఇవన్నీ లభించాలం టే, ముందు మనలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు నశించాలి. మనలో ఉన్న అంత: శత్రువులు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) నశిస్తే కానీ సాధ్యంకాదు. దానికి ఆయుధం కావాలి. లోప ల ఉన్న శత్రువులను జయించాలంటే యోగము అనే అయుధం కావాలి. దానికి అధిపతి కృష్ణుడు. ఆయన యోగేశ్వరేశ్వరుడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది. అర్జునుడు ఎక్కడ ఉం టాడో అక్కడ అధర్మం నా శనం అవుతుంది. కాబట్టి కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఐశ్వ ర్యం, సుఖము, శాంతి లభి స్తుంది.
కృష్ణుడు జ్ఞాన యోగమునకు ప్రతీక అందుకే యోగేశ్వరుడు అని అన్నారు వ్యాసుల వారు. అర్జు నుడు కర్మయోగానికి ప్రతీక. అందుకే ధనుర్ధర: అని అన్నారు. ముందు కర్మయోగము ఆచరించి, దాని ద్వారా జ్ఞానమును సంపాదించాలి. ఆత్మజ్ఞానము పొందాలి. దీని పరిణామము ధ్రువా నీతి అంటే నీతి ధృవంగా వర్ధిల్లుతుంది. పరమ శాంతి కలుగుతుం ది. కాబట్టి అందరూ కృష్ణార్జునులను పూజాగృహ ములోనే కాదు, మనసులో కూడా నిలుపుకొని గీత ను ప్రతి నిత్యమూ అధ్యయనం చేసి, స్మరించుకుం టూ, మననం చేసుకుంటూ ఆచరిస్తే, వారికి అనంత ఐశ్వర్యం, పరమశాంతి లభిస్తాయి అని గీతాసార ము. దీనితో భగవద్గీత సంపూర్ణము.
శ్రీ మహాభారతం మధ్యలో ఆణిముత్యంలా భాసిల్లుతున్న, ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్య యోగశాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాద రూపంలో మనకు వ్యాసుల వారు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement