Tuesday, November 26, 2024

భక్తుని కోరికపై వెలసిన యాదాద్రీశుడు!

యాదాద్రి క్షేత్రం అభివృద్ధిలో భా గంగా ఆలయ ఉద్ఘాటన జరి గిన తర్వాత రెండోసారి జరగనున్న వా ర్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబయింది. నేటి నుంచి ప్రారంభ మైన ఈ ఉత్సవాలు 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నా యి. ఉత్సవాలలో భాగంగా యాదగిరీ శుడు రోజుకో అవతారంలో దర్శనమి స్తాడు. ఈరోజు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం క్రతువుల ను నిర్వహించారు. ఈనెల 21వ తేదీ నిర్వహించే శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల పాటు ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొ క్కులు, కల్యాణాలు, సుదర్శన నారసిం హ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూ జలను తాత్కాలికంగా రద్దుచేసారు.

దేదీప్యమానంగా యాదగిరిగుట్ట

లక్ష్మీనరసింహుని ప్రధాన ఆలయ ముఖమంటపం, హనుమాన్‌ టెంపుల్‌, ఆండాళ్‌ అమ్మవారి ఆలయాలను ప్రత్యేక విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. సప్తగోపుర ప్రధాన ఆలయ సముదాయానికి ప్రత్యేక లేజర్‌ లైటింగ్‌ పెట్టారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రముఖులకు, భక్తులకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక స్వాగత తోరణాలు ఆర్చీలను ఏర్పాటుచేసారు.

క్షేత్ర విశిష్టత

త్రేతాయుగంలో భువనగిరి- రాయగిరి మధ్య ఉన్న ఈ కొండపై ఆంజనే యస్వామి ఆశీర్వాదంతో ఒక గుహలో ఋష్యశృంగ యాదమహర్షి నివసించా రు. ఋష్యశృంగ మ#హర్షి, శాంతల పుత్రుడు యాదమ#హర్షి. ఆయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఆంజనేయస్వామి సలహాపై ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు.
ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదు గానీ, ఆయన ఎవరి గురించైతే తప స్సు చేస్తున్నాడో ఆ శ్రీహరి ఆయుధం అయిన సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సం#హరిం చింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్టసంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వర మిచ్చి అంతర్ధానం అయినట్లు కథనం.
ఆ తదుపరి యాద మహర్షి తన తపస్సుని కొనసాగించగా, ఆయన తపస్సు కి మెచ్చి నరసిం#హస్వామి శ్రీ జ్వాలానరసింహ, శ్రీ యోగానంద, శ్రీ గండభే రుండ, శ్రీ ఉగ్ర మరియు శ్రీలక్ష్మీనరసింహ వంటి ఐదు విభిన్న రూపాల లో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఐదు రూపాలు ప్రస్తుతం ఆలయంలో పంచ నరసింహ క్షేత్రంగా పూజింపబడుతున్నాయి. ప్రత్యక్షమై, యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసిం#హస్వా మిగా వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరి గా ఋషి పేరుమీద ప్రసిద్ధికెక్కింది.
ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొం డ క్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని అంటారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు.
ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసిం#హస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధించగా ఆమె ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపం తో కొలువై వుండటం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో లక్ష్మీ నరసిం #హస్వామిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు, లక్ష్మీసమేతుడై కొండపై గల గుహలో వెలిశారు.
ఆయన వెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వా మివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి జారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు.
చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టు ప్ర క్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరి ణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పు డు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గం ధ పుష్పాదులు కూడా నిదర్శనమని అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement