Tuesday, November 26, 2024

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌:పంచనృసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్స వాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యారు. ఈ నెల 14వ తేదీ వరకు 11 రోజుల పాటు అంతరం గికంగా నవాహ్నిక పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించే ఈ బ్రహ్మోత్స వాలకు బాలాలయంలో స్వస్తివాచనంతో అర్చకులు అంకురార్పణ చేశారు.ఆచార్యులు మూలవర్యు లకు అభిషేకం గావించి శ్రీ స్వామి, అమ్మవార్లను కల్యాణమూర్తులుగా ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ శుద్ధి అనంతరం విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచన పూజ చేశారు. ఈ సందర్భంగా రుత్వి కులకు, పండితులకు కంకణధారణ చేశారు. సాయంత్రం మృత్యంగ్రహణం చేసి బ్రహ్మోత్సవాలకు అంకురారోహణగావించారు. అంతకు ముందు ప్రధానా లయంలో ప్రవేశించి, ప్రత్యేక పూజ.లు చేసి శ్రీ స్వామి వారి అనుమతి పొందారు. బ్రహ్మోత్సవాలకు ముందు స్వయంభువుల అనుమతిని స్వీకరించడం అనవాయితీ. భూదాన్‌ పోచంపల్లికి చెందిన పద్మశాలి మహాజన సంఘం ప్రతినిధులు శ్రీ స్వామి, అమ్మ వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగటి మోహనా చార్యులు, ఉప ప్రధానార్చకులు చింతపట్ల రంగాచారి, కాండూరి వెంకటా చార్యులు, సురేంద్రచారి, శ్రీధరాచారి, అర్చక బృందం ఉత్సవ కార్యక్రమాలకు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ బి నర్సిం హామూర్తి, ఈవో ఎన్‌ గీత, ఏఈవోలు గజవెల్లి రమేష్‌బాబు, దోర్భల భాస్కరశర్మ, సూపరింటెండెంట్‌ గజవెల్లి రఘు తదితరులు తొలి పూజలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement